మళ్లీ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..... పవన్ కళ్యాణ్ సినిమాకు మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది వీరి కాంబినేషన్లో కొత్త సినిమా మొదలు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కిషోర్ పార్థసాని ఈ చిత్రానికి దర్శకత్వ వహిస్తున్నారు. హిందీలో హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ త్వరలో చేయబోయే 'గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు విషయానికొస్తే...శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకుడు. 'గబ్బర్ సింగ్ 2' స్క్రిప్టు విషయంలో పవన్ చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో తనే స్వయంగా రాస్తూ, దాన్ని అందంగా చెక్కుతున్నారు.


Click it and Unblock the Notifications











