అన్నయ్య చిరు ఛాలెంజ్‌పై వెంటనే రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్!
Recommended Video

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌పై వెంటనే రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ ఛాలెంజ్ స్వీకరించిన పవర్ స్టార్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. కొన్ని రోజలుగా సోషల్ మీడియాలో హరితహారం ఛాలెంజ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటూ ఇతర సెలబ్రిటీలకు సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి... తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రామోజీరావును సవాల్ చేశారు.

జనసేన కార్యాలయంలో మొక్కలు నాటిన పవర్ స్టార్
మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మొక్కలు నాటుతున్న పవన్ కళ్యాణ్.

అభిమానులకు, జన సైనికులకు పిలుపు
మొక్కలు నాటే కార్యక్రమంలో అభిమానులతో పాటు జన సైనికులు పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కోరారు.

మొక్కలు నాటిన చిరంజీవి
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి మొక్కలు నాటడంతో పాటు... తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రామోజీరావును మొక్కలు నాటాలని సవాల్ చేశారు.

టాలీవుడ్లో ట్రెండింగ్
టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు... ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి, మోహన్ బాబు తదితరులు ఈ ఛాలెంజ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











