twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు సినిమాల‌కు డేట్లు ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

    |

    పవన్ కల్యాణ్ క‌థానాయ‌కుడిగా 'హరి హర వీరమల్లు' సినిమాను దర్శకుడు క్రిష్ తీర్చిదిద్దుతున్నారు. ఏ.ఎం.ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. త‌ర్వాత ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా మార‌డంతో ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే విష‌య‌మై స్ప‌ష్ట‌త రాలేదు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకి అక్టోబర్ నెల చివరి నుంచి వరుస డేట్స్ ఇచ్చార‌ని, ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్ తో ఈ సినిమా పూర్తిచేసి వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలనే ఆలోచనలో ప‌వ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు.

    సముద్రఖని చిత్రానికి కూడా..

    సముద్రఖని చిత్రానికి కూడా..

    అలాగే సముద్రఖని దర్శకుడిగా రూపొందబోతున్న 'వినోదయా సితం' రీమేక్ కోసం 20 రోజుల పాటు డేట్స్ ఇచ్చారు. అది చిన్న సినిమా కావడం .. పవన్ పాత్ర నిడివి తక్కువగా ఉండ‌టంతో 20 రోజుల్లోనే ఆయన దాన్ని పూర్తి చేయనున్నారు. 'భవదీయుడు భగత్ సింగ్' సంగతేమిటనే విష‌య‌మై స్ప‌ష్ట‌త రాలేదు. ముందు ఈ రెండు సినిమాలు పూర్త‌యిన త‌ర్వాత దానిమీద దృష్టిపెడ‌తార‌ని భావిస్తున్నారు.

    పాన్ ఇండియాగా విడుదల చేయాలని..

    పాన్ ఇండియాగా విడుదల చేయాలని..


    హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమాగా క్రిష్ రూపొందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స‌బ్జెక్ట్ కావ‌డంతో దీన్ని దేశ‌వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌, ద‌ర్శ‌కులు భావిస్తున్నారు. కానీ అందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆస‌క్తి చూపించ‌డంలేద‌ని తెలుస్తోంది. ముందు తెలుగుకు ప్రాధాన్య‌త ఇచ్చి త‌ర్వాత చూద్దాంలే అనే ధోర‌ణిలో ఉన్నార‌ని, ఇంత‌కుముందు భీమ్లానాయ‌క్‌ కూడా అలాగే అనుకున్న‌ప్ప‌టికీ వీల‌వ‌లేద‌ని, కానీ దీన్ని మాత్రం తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డం, హిందీలో విడుద‌ల చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో క్రిష్ ఉన్నారు.

     అభిమానుల నుంచి ఒత్తిడి

    అభిమానుల నుంచి ఒత్తిడి


    మొద‌టి నుంచి క్రిష్ ను గౌర‌వించే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న మాట‌కు విలువిచ్చి ఒక‌వేళ దేశ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు ఒప్పుకుంటే ప‌వ‌న్ అభిమానుల‌కు పండ‌గే. ఆ సంద‌ర్భం కోస‌మే వారు కూడా ఎదురుచూస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మొద‌టి పాన్ ఇండియా సినిమా అవ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో నిర్మాత ర‌త్నం కూడా ఉన్నారు. ఈ ఇద్ద‌రూ పవ‌న్‌కు బాగా స‌న్నిహితులు కావ‌డంతో వారిమాట‌ను గౌర‌విస్తే త‌మ హీరోకు ఇంత‌కంటే మంచి స‌బ్జెక్ట్ ఉన్న మూవీ దొరకదని, దీన్నే పాన్ ఇండియాగా విడుద‌ల చేయాల‌నే ఒత్తిళ్లు నిర్మాత, దర్శకులపై కూడా ఉన్నాయి. అభిమానుల కోరిక ఇదేన‌ని ప‌వ‌న్‌కు చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో వేచిచూడాలి.

    English summary
    It is said that a series of dates have been given since the end of October and Pawan is thinking of completing this film with this schedule and bringing it to the audience next summer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X