34 కోట్ల అప్పులో పవన్ కళ్యాణ్.. వదినకు 1.7 కోట్లు, త్రివిక్రమ్‌కు 2.4 కోట్లు.. అకీరా ఆస్తి ఎంతంటే!

Recommended Video

Huge Debts For Janasena President Pawan Kalyan | Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన జనసేన పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గాజువాక నియోజకవర్గానికి గాను పవన్ తొలిసారి గురువారం రోజు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పొందుపరిచిన తన ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

 గాజువాకలో నామినేషన్

గాజువాకలో నామినేషన్

కొద్దిరోజుల క్రితం తాను గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం రోజు పవన్ కళ్యాణ్ అభిమానుల కేరింతల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌లో తన చర, స్థిర ఆస్తుల వివరాలు, అప్పులు పొందుపరిచారు. పవన్ కళ్యాణ్ ఎంత అప్పు ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.

మొత్తం ఆస్తి విలువ

మొత్తం ఆస్తి విలువ

తనకు మొత్తం 52 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. అందులో 40 కోట్లా స్థిర ఆస్తులు ఉండగా, మరో 12 కోట్ల విలువైన చర ఆస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు. స్థిర ఆస్తుల్లో పవన్ కళ్యాణ్ నివసిస్తున్న ఇల్లు, ఫామ్ హౌస్, భూములు లాంటి ఆస్తులు ఉన్నాయి. తనకు మెర్క్డ్స్ బెంజ్ ఆర్ క్లాస్ కారు. వోల్వో ఎక్స్ సి 90 కారు ఉన్నట్లు పేర్కొన్నారు.

34 కోట్ల అప్పు

34 కోట్ల అప్పు

తాను వివిధ చిత్ర నిర్మాణ సంస్థలకు, వ్యక్తులకు 34 కోట్ల మేర అప్పు ఉన్నట్లు పవన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు 2.4 కోట్ల అప్పు ఉన్నట్లు పవన్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక తన వదిన కొణిదెల సురేఖకు కూడా 1.7 కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని సంస్థ నుంచి 25 లక్షలు తీసుకుని ఉన్నట్లు పవన్ తెలిపారు. కొందరు ఇతర వ్యక్తులకు కూడా బాకీ పడ్డట్లు అఫిడవిట్ లో తెలిపాడు.

అకీరా ఆస్తి ఏంటంటే

అకీరా ఆస్తి ఏంటంటే

ఇక తన పిల్లలు, భార్య పేరున ఉన్న ఆస్తి విరాలని కూడా పవన్ పొందుపరిచాడు. పెద్ద కుమారుడు అకీరా పేరున 1.5 కోట్లు, కుమార్తె ఆద్య పేరున ఒక కోటి ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. తన సతీమణి అన్నా లెజినోవా వద్ద 30 లక్షల విలువైన చర ఆస్తులు ఉన్నట్లు పవన్ తెలిపారు. తన వద్ద 312 గ్రాముల బంగారం ఉన్నట్లు కూడా పవన్ అఫిడవిట్‌లో పొందుపరిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X