పవన్ కళ్యాణ్ ప్రిన్సిపుల్స్ తోనే రేణుదేశాయ్ దూరమైందా...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సాఫ్ట్ మెంటాలిటీ కలవాడని, తనకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ ను పెట్టుకుని జీవితాన్ని లీడ్ చేస్తాడనే టాక్ చిత్రపరిశ్రమలో ఉంది. తన అన్న పీఆర్పీ పార్టీని స్థాపించినప్పుడు తన వంతుగా ఈ పార్టీ కోసం ఎంత కృషి చేసాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే పార్టీని తన అన్న తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా అప్ సెట్ అయ్యాడట. ఇదిలా ఉంటే 'పులి" చిత్రం ప్లాప్ అయిన తర్వాత ఆ చిత్ర నిర్మాతకు పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో కొంత డబ్బును తిరిగి ఇచ్చేశాడని సమాచారం.
ఇది పవన్ భార్య రేణు దేశాయ్ కి చాలా కోపాన్ని తెప్పించిందట. పెట్టెబేడా సర్థుకుని తన సొంత ఊరికి వెళ్ళిపోయిందట. దాంతో ఎలాగైనా డబ్బులు సంపాదించి తన భార్య దగ్గర తనేంటో నిరూపించుకోవాలిన పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడని సమాచరం.


Click it and Unblock the Notifications











