డబ్బింగ్ షురూ చేసిన ‘రాంబాబు’
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఈచిత్రం షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ నేటి నుంచి డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే తమన్నా పాత్రకు డబ్బింగ్ ప్రారంభం అయింది.
ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారు. అన్యాయాలను ఎదురించే ధైర్యంగల రిపోర్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్ పాత్ర చేస్తోంది. అమ్మడు అందాల ప్రదర్శనపై కూడా ఈచిత్రంలో బాగా ఫోకస్ చేసారని సమాచారం.
ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్టబర్ 18న ఈచిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆడియో వేడుక గ్రాండ్‌గా జరుగాల్సి ఉండగా...హీరో పవన్ కళ్యాణ్ ఆడియో వేడుక నిర్వహించడానికి విముఖత చూపడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. పవన్ కళ్యాణ్‌కి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనకు సంబంధించిన ఏ వేడుక జరిగిన తండోపతండాలుగా అభిమానులు తరలి వస్తుంటారు. పంజా, గబ్బర్ సింగ్ ఆడియో వేడుకల సందర్భంగా భారీగా అభిమానులు తరలి రావడంతో చోటు సరిపోక చాలా మంది బయటే ఉండి పోయారు. క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్‌తో అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకూడదని, తన వల్ల, తన సినిమా వల్ల ఇంత మంది ఇబ్బంది పడటం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు నో చెప్పినట్లు తెలస్తోంది.
పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాష్ రాజ్, గ్యాబ్రియల్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్.


Click it and Unblock the Notifications











