ఫోర్బ్స్ జాబితా: సంపాదనలో పవన్ కళ్యాణ్ నెం.1
హైదరాబాద్: టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాపులారిటీలోనే కాదు, సంపాదనలోనూ నెం.1 అని తేలింది. ప్రతి ఏటా సెలబ్రిటీల సంపాదన వివరాలు, పాపులారిటీ ర్యాంకులు ప్రకటించే ప్రముఖ ఇంటర్నేషనల్ పత్రిక ఫోర్బ్స్ 2013 సంవత్సరానికి విడుదల చేసిన జాబితాలో తెలుగు చిత్రసీమకు సంబంధించి పవన్ కళ్యాణ్ అగ్రస్థానం నిలిచాడు.
పవన్ కళ్యాణ్ సంపాదన 2013 సంవత్సరంలో రూ. 57 కోట్లుగా ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. భారత దేశంలోని సెలబ్రిటీల జాబితాలో పవన్ కళ్యాణ్ 26వ స్థానంలో నిలిచాడు. అదే విధంగా డబ్బు సంపాదన విషయంలో 13వ స్థానంలో, పాపులారిటీ విషయంలో 79వ స్థానంలో నిలిచాడు.
ఇక మహేష్ బాబు 28.96 కోట్లు సంపాదనతో పవన్ కళ్యాణ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. నాగార్జున 20.5 కోట్లు, రవితేజ 13 కోట్లు, రామ్ చరణ్ 12.67 కోట్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. మొత్తానికి ఫోర్బ్స్ జాబితా విడుదలతో టాలీవుడ్ నెం.1 స్టార్ ఎవరు అనే సందిగ్ధానికి తెరపడినట్లయింది.
ఇటీవలే 'అత్తారింటికి దారేది' చిత్రంతో హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్....త్వరలో 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. సినిమా ఇంకా మొదలు కానప్పటికీ.....ముందస్తుగా పక్కా ప్లానింగుతో రెడీ అయ్యారు దర్శక నిర్మాతలు. దర్శకుడు సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications












