twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల ప్రచారానికి పవన్‌కళ్యాణ్ షెడ్యూల్

    By Srikanya
    |

    బెంగళూరు : రీసెంట్ గా పార్టీ పెట్టి తెలుగు దేశం, బిజెపీ లకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నారు. చిక్కబళ్ళాపుర నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జనసేన పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖనటుడు పవన్‌కళ్యాణ్ త్వరలోనే వస్తారని బీజేపీ అభ్యర్థి బచ్చేగౌడ వెల్లడించారు. ఈనెల 13న పవన్‌తో పాటు వెంకయ్యనాయుడు ప్రచారంలో పాల్గొంటారన్నారు.

    తొలి బహిరంగ సభను విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ... వివిధ అంశాల వారీగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు... ఇలా ఆయా వర్గాల వారితో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రతీ వారం, పది రోజులకు ఏదో ఒక కార్యక్రమం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

    Pawan Kalyan has to visit Chickballapur

    ఆయన తన స్పీచ్ లలో పలు అంశాలపై తన హృదయాన్ని ఆవిష్కరించారు. 'కాంగ్రెస్‌ కో హఠావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై విరుచుకుపడ్డ పవన్‌... కాంగ్రెస్‌పై, ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలపై నిప్పులు చెరిగారు. అయిదేళ్ల పాటు ఏం చేయకుండా... ఆఖర్లో 23 నిమిషాల్లోనే ప్రత్యక్ష ప్రసారాలను ఆపి మరీ లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని, ఏ ప్రాంతానికి సంతృప్తి కలిగించలేదని విమర్శించారు. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే 2009 లోనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు రాష్ట్ర ప్రజలను అందుకు సిద్ధం చేసివుంటే తెలంగాణలో ఇంత మంది తల్లులకు గుండెకోత ఉండేది కాదన్నారు.

    తెలంగాణకూ న్యాయం చేయలేదని, హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారని, ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను లేకుండా చేశారని ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేసిన పీవీ నర్సింహరావు చనిపోతే... ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం లోపలికి రానివ్వలేదని, హైదరాబాద్‌కు పంపేస్తే ఇక్కడా కాలీ కాలకుండా సంస్కారం చేశారని చెప్పారు. పీవీ అంటే అధిష్ఠానానికి అంత కోపమన్నారు. ప్రతీ తెలుగువాడూ పీవీ నరసింహారావులా అధిష్ఠానానికి కనిపించాడో ఏమో రాష్ట్రంపై ఇంతటి కోపం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.

    English summary
    BN Bachegowda says...Pawan Kalyan has to visit Chickballapur once before election.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X