పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై లేటెస్ట్ రిపోర్ట్: మరికొన్ని రోజులు అలాగే.. అప్పటి వరకూ కనిపించడం కష్టమే

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. తద్వారా వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు. దాదాపు మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. 'వకీల్ సాబ్' సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న సమయంలోనే కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఆ వెంటనే కొద్ది రోజులకు నెగెటివ్‌ రిపోర్టు కూడా వచ్చింది. ఇక, తాజాగా పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఓ సమాచారం తెలిసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ.. రికార్డులు బద్దలైనా

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ.. రికార్డులు బద్దలైనా

సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా ఓపెనింగ్స్ రికార్డులు బద్దలు కొట్టినా.. నష్టాలనే మిగుల్చుకుంది.

అప్పుడే క్వారంటైన్‌లోకి వెళ్లిన పవర్ స్టార్

అప్పుడే క్వారంటైన్‌లోకి వెళ్లిన పవర్ స్టార్

'వకీల్ సాబ్' మూవీ యూనిట్‌కు సంబంధించిన పలువురు ప్రమోషన్ సమయంలోనే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వాళ్లతో పాటు పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ స్టార్ హీరో హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన ఫాం హౌస్‌ నుంచి అన్ని పనులు చూసుకున్నాడు.

పవన్ కల్యాణ్‌కు కరోనా... ఇండస్ట్రీ రెస్పాన్స్

పవన్ కల్యాణ్‌కు కరోనా... ఇండస్ట్రీ రెస్పాన్స్

ఫాం హౌస్‌లో క్వారంటైన్‌లో గడుపుతోన్న సమయంలోనే కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో పవన్ కల్యాణ్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగాయి. పేరున్న ఆస్పత్రికి చెందిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. పవన్ ఆరోగ్యంపై సినీ ప్రముఖులంతా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఫలించిన ప్రార్థనలు.. పవన్‌కు కోవిడ్ నెగెటివ్

ఫలించిన ప్రార్థనలు.. పవన్‌కు కోవిడ్ నెగెటివ్

పవన్ కల్యాణ్ కరోనా బారిన పడినప్పటి నుంచి ఆయన అభిమానులు దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పవర్ స్టార్ మరోసారి కరోనా పరీక్షలు చేసుకున్నారు. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ఆయన సన్నిహితులంతా ఊపిరి పీల్చుకున్నారు.

బయటకు రాని పవన్ కల్యాణ్.. ఏమైందంటూ

బయటకు రాని పవన్ కల్యాణ్.. ఏమైందంటూ

పవన్ కల్యాణ్‌కు కరోనా నెగెటివ్ వచ్చినట్లు జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ప్రస్తుతానికి పవర్ స్టార్ ఆరోగ్యం ఎలా ఉంది? అన్న విషయాలు మాత్రం తెలియ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అభిమానులతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలంతా అసలేం జరుగుతుందో అర్థం కాక కంగారు పడుతున్నారు. దీంతో వాళ్లంతా క్లారిటీ కోరుతున్నారు.

Recommended Video

Allu Arjun Tests COVID-Positive, In Home Quarantine | Filmibeat telugu
పవన్ హెల్త్ కండీషన్‌పై లేటెస్ట్ రిపోర్టలు ఇవే

పవన్ హెల్త్ కండీషన్‌పై లేటెస్ట్ రిపోర్టలు ఇవే

పవన్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన కరోనా బారి నుంచి కోలుకున్నాడట. అయితే, నీరసంగా ఉన్నారని తెలుస్తోంది. దీనికితోడు బయట పరిస్థితులు బాలేదు కాబట్టి.. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమయంతా ఫాం హౌస్‌లోనే గడపాలని ఆయన డిసైడ్ అయ్యాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X