హాట్ టాపిక్: జిమ్ కి పవన్ కళ్యాణ్ (లీకెడ్ వీడియో)
హైదరాబాద్ : పవన్ ఫ్యాన్స్ అంతటా ఉన్నారు. ఆయన్ని బయిట ఒక్కసారి చూస్తే చాలు జీవితం ధన్యం అనుకుంటూంటారు. అలాంటివాళ్లు ఆయన జిమ్ కి వెళ్లి వస్తూ కనపడితే ఊరుకుంటారా. ఇదిగో ఇలా మా హీరోని వీడియో తీసాం అని యూ ట్యూబ్ లో పెట్టేస్తారు. ఆయన బెంగళూరులో ఉండగా తీసిన వీడియో అని సమాచారం.
రీసెంట్ గా సర్జరీ చేయించుకున్న పవన్ తిరిగి తన స్మార్ట్ లుక్ లోకి ఇలా పరకాయ ప్రవేశం చేసారు. జిమ్ కు రెగ్యులర్ గా వెళ్తూ గోపాల గోపాల షూటింగ్ కి తిరిగి వచ్చారు. ఈ లుక్ లో చూసిన పవన్ ని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడా ఏజ్ అనేది కనపడకుండా తమ్ముడు,తొలిప్రేమ నాటి ఛామ్ ఇప్పటికీ మెయింటైన్ చేయటం ఆశ్చర్యమే అంటున్నారు.
ఇక పవన్‌కల్యాణ్ 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీకృష్ణుడి పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రలో పవన్ పలికే సంభాషణలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. పవన్ అభిమానుల్ని మరింతగా సంతోషపెట్టాలన్న ప్రయత్నంలో భాగంగా పాత్రని మరికొంచెం పెంచాలని చిత్రబృందం భావించిందట. అయితే పవన్ ఆ ప్రయత్నాన్ని మొదట్లో తిరస్కరించినట్టు సమాచారం. కథని ఉన్నదున్నట్టు తీస్తేనే మేలని... పాత్రని ఏమాత్రం కదపనీయలేదట. కానీ ఇప్పుుడ మార్చిన స్క్రిప్టు విని బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
వెంకటేష్, పవన్‌కల్యాణ్ జోడీ చాలా బాగుందనీ... వారిద్దరూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాలు పంచబోతున్నారని చిత్రబృందం చెబుతోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. త్వరలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్' చిత్రానికిది రీమేక్. పవన్ కల్యాణ్ మోడరన్ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ''భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్ కల్యాణ్, వెంకటేష్ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అంటున్నారు.
సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, కూర్పు: గౌతంరాజు


Click it and Unblock the Notifications











