twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సన్నాసి.. దద్దమ్మ..మేము సినిమా తీస్తే మీరు అమ్ముకొంటారా? ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ధ్వజం

    |

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్వేగభరితంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం సంచలనం రేపింది. అటు రాజకీయ, సినీ పరిశ్రమల్లో సంచలనం రేపింది. ఈ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

    సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పవన్ కల్యాణ్

    సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పవన్ కల్యాణ్


    సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. సినిమా విడుదల ముందు సాయితేజ్ ప్రమాదానికి గురికావడం బాధాకరం. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తి సాయి ధరమ్ తేజ్. సాయితేజ్ ఆస్పత్రిలో ఉన్నందువల్లే ఈ కార్యక్రమానికి వచ్చాను. నేను ఎప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమా ఫంక్షన్లకు రాలేదు. అతివేగమే సాయితేజ్ ప్రమాదానికి కారణమని ప్రచారం చేశారు. సాయితేజ్ రోడ్డుప్రమాదంపై లేనిపోని కథలు అల్లారు. 45 కిలోమీటర్ల వేగంతో ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కింద పడ్డాడు. సినిమాలో చెప్పిన విలువలు నిజ జీవితంలో అమలుచేయడం కష్టం. సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్లు తెరవలేదు. రాజకీయాల్లో దిగజారుడుతనంపెరుగుతోంది. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై ఏవేవో మాట్లాడుతున్నారు అని పవన్ కల్యాణ్ అన్నారు.

    సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి

    సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి

    సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై లేని పోని, అవాస్తవ కథనాలు ప్రసారం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యై ఎందుకు కథనాలు రాయడం లేదు. కోడి కత్తి గురించి మాట్లాడండి అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. మీడియా పక్షపాతంగా వ్యవహరించడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయల్లో జరుగుతున్న అవినితీ, కుట్రలు, కుతంత్రాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమపై కన్నెత్తి చూస్తే మాసి మాడిపోతారని హెచ్చరించారు. సినిమా వారు వ్యాపారం చేసుకోకూడదా అంటూ నిలదీశారు. సినిమా బడ్జెట్ చిన్నది కావొచ్చు.. కానీ దాని ప్రభావం పెద్దది అంటూ హెచ్చరించారు.

    మేము తీస్తే టికెట్లు అమ్ముతారా?

    మేము తీస్తే టికెట్లు అమ్ముతారా?

    వకీల్ సాబ్ సినిమా లేకుంటే ఆంధ్ర‌ప్రదేశ్‌లో చాలా సినిమాలు రిలీజ్ అయి ఉండేవి. కులం చూసి బంధాలు పెంచుకోలేదు. వ్యక్తిత్వాన్ని చూసి పెంచుకున్నా అని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా మేము తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా? అమ్మడానికి మీరు ఎవరు? అంటూ పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రశ్నించారు. టికెట్ల వివాదంపై మోహన్ బాబు మాట్లాడాలి. అతనికి నైతిక బాధ్యత ఉంది. ఈ రోజు సినిమా రంగం.. రేపు నీ విద్యాసంస్థలపై పడుతారు అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.

    సన్నాసి మంత్రి అంటూ..

    సన్నాసి మంత్రి అంటూ..


    మేము సినిమా తీస్తే నువ్వు టికెట్లు అమ్ముతావా? సన్నాసి మంత్రి.. మీ ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టే సినిమా టికెట్లు అమ్మి డబ్బు నొక్కేద్దామని చూస్తున్నారా? సినిమా వారు వ్యాపారం చేసుకోకూడదా? టిక్కెట్లు
    అమ్మడానికి మీరు ఎవరు? నాపై కోపం ఉంటే నా సినిమాలు ఆపండి అని పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. ప్రస్తుతం పవన్ కల్యాన్ ప్రసంగం సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.

    వకీల్ సాబ్ సినిమా లేకుంటే

    వకీల్ సాబ్ సినిమా లేకుంటే


    వకీల్ సాబ్ సినిమా లేకుంటే ఆంధ్ర‌ప్రదేశ్‌లో చాలా సినిమాలు రిలీజ్ అయి ఉండేవి. కులం చూసి బంధాలు పెంచుకోలేదు. వ్యక్తిత్వాన్ని చూసి పెంచుకున్నా అని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా మేము తీస్తే టికెట్లు మీరు అమ్ముతారా? అమ్మడానికి మీరు ఎవరు? అంటూ పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రశ్నించారు. టికెట్ల వివాదంపై మోహన్ బాబు మాట్లాడాలి. అతనికి నైతిక బాధ్యత ఉంది. ఈ రోజు సినిమా రంగం.. రేపు నీ విద్యాసంస్థలపై పడుతారు అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.

    English summary
    Pawan Kalyan Hot comments on YS Jagan mohan Reddy Government in Republic pre release event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X