పవన్ కళ్యాణ్‌కు సరికొత్త అర్థం చెబుతున్న ఫ్యాన్స్!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోను వైవిద్యంగా ప్రమోట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం సినిమా హీరో కాదు....ఆయనొక ఇన్‌స్పిరేషన్ అంటూ ముందుకు సాగుతున్న ఫ్యాన్స్ ఇప్పటికే 'పవనిజం' కాన్సెప్టును జనాల్లోకి తీసుకెళ్లడంలో తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా 'Pawan Kalyan' స్పెల్లింగుకు సరికొత్త అర్థాన్ని ప్రచారంలోకి తెచ్చారు. (P)eople's (A)ctor (W)ith (A)mazing (N)ature (K)ing of (A)ndhra (L)oves (Y)outh (A)nd (N)ever fais Pawanism అంటూ పుంగి భజాయిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకింత అభిమానం అని ఏ అభిమానినయినా అడిగితే.....మా హీరో మనసున్న హీరో, లవ్లీ నేచర్, గుడ్ బిహేవియర్ వీటికి తోడు అదిరిపోయే స్టైల్ అని గొప్పగాచెబుతుంటారు. పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు కూడా ఆయనకు ఈ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ఓ కారణం అంటున్నారంతా.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, ప్రణీత హీరోయిన్లు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications