twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీఆర్పీలను మించిన ఆట చూపిస్తా.. మహిళలను కించపరుస్తుంటే ఏం చేస్తున్నారు.. పవన్

    |

    తెలుగు చలన చిత్ర పరిశ్రమను పలుచన చేస్తూ... నటీమణుల గౌరవానికి భంగం కలిగిస్తు చిత్ర సీమలో కుటుంబాలను అబాసుపాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తుంటే చట్టపరంగా ఏమి చెయ్యలేని చిత్ర పరిశ్రమ. శుక్రవారం ఉదయం నుండి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తిట్లతో ఎండగట్టారు.

    Recommended Video

    మీడియా పై మరిన్నీ ట్వీట్లు చేసిన పవన్ కళ్యాణ్

    అసలు రాష్టానికి మేలు జరుగాలని ఏమి ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేసాం. కానీ, మీరు మా అబ్బాయి, స్నేహితులు చేయూత నిచ్చిన చేతులను వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా విరిచేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

     నా తల్లిని దూషిస్తారా?

    నా తల్లిని దూషిస్తారా?

    తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రపై పవన్ కళ్యాణ్ గారు తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాపై ఆరోపణలు చేస్తున్న, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు ఉన్నారు. కానీ వారి ఇంట్లో ఉన్న మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టిఆర్పిలు, రాజకీయ లాభాల కోసం వయసై పోతున్న నా డెబ్భై ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు.

    దానిని మించిన షో చూపిస్తా

    దానిని మించిన షో చూపిస్తా

    మీరంతా టిఆర్పిల కోసం టివి షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నిటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడికంటే ముందు, రాజకీయ నాయకుడికంటే ముందు ఒక అమ్మ బిడ్డను. కోడుకుగా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే బ్రతకడం కంటే చావడం మంచిది అంటూ చేసిన ట్విట్ ఆయన మనోవేదనను తెలియజేస్తుంది.

    అక్కాచెల్లెల్లకు ధన్యవాదాలు

    అక్కాచెల్లెల్లకు ధన్యవాదాలు

    మీరంతా కలిసి సమాజంపై ఈ రకమైన హత్యా చారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడిన మీ అక్క చెల్లెళ్ళకు, ఆడపడుచుదలకు ధన్యవాదాలు. ఆత్మగౌరవంతో బ్రతికేవాడు ఏ క్షణంలో అయినా చావడానికి సిద్ద పడితే, అసలు దేనికైనా భయపడతాడా ? వెనకంజ వేస్తాడా ? అని ప్రశ్నించారు.

    టీవీ ఛానెళ్ల తీరుపై పవన్ ఫైర్

    టీవీ ఛానెళ్ల తీరుపై పవన్ ఫైర్

    ఉదయం పది గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. తెలుగు సినిమా రంగాన్ని కించపరుస్తూ కొన్ని టివి చానళ్ళు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫిలిం చాంబర్ చేరుకున్న విషయం తెలిసిన మా నిర్మాత మండలి ఫిలిం చాంబర్ ఫెడరేషన్ తో పాటు వివిధ యూనియన్ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన వారిపై కించపరిచేలా మాట్లాడితే ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

     శనివారం చిత్ర పరిశ్రమ సమావేశం...

    శనివారం చిత్ర పరిశ్రమ సమావేశం...

    పవన్ కళ్యాణ్ గారితో 'మా' నాయకులు శివాజీ రాజా, హేమ, అనితా చౌదరి, ఏడిద శ్రీరామ్, యువ కథానాయకులు రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయ ధరమ్ తేజ్, అల్లు శిరీష్, నటుడు కృష్ణుడు, దర్శకుల సంఘం తరుపున వివి.వినాయక్, శ్రీకాంత్ అడ్డాల, మెహర్ రమేష్,వీర శంకర్, మారుతి నిర్మాత మండలి నుండి సుధాకర్ రెడ్డి, దామోదర్ ప్రసాద్ అల్లు అరవింద్, నాగ అశోక్ కుమార్, ఎస్, రాదా కృష్ణ, ముత్యాల రామ్ దాస్ రచయితలు పరుచూరి బ్రదర్స్, విశ్వ, పెడరేషన్ నుండి కొమరా వెంకటేష్ తదితరులు వచ్చారు.

    పవన్ సూచనలపై చర్చ

    పవన్ సూచనలపై చర్చ

    ప్రస్తుత పరిణామాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసిన నిరసనపై స్పష్టత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రకటిస్తారు.

    English summary
    Ram Gopal Varma, Pawan Kalyan's war between in social media goes high pitch. Pawan has been attacking media group with tweets. In this occassion, Pawan Kalyan went to Film Chamber today. After that he press release for media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X