నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై
పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చగా మారింది. గబ్బర్ సింగ్ ఆడియో కు సిఎన్ఎన్- ఐబిఎన్ వారు సైతం లైవ్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. నేషనల్ ఛానెల్స్ సైతం ఈ ఆడియోని కవర్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయాన్ని తమ సైట్ లో సైతం వాళ్లు మెన్షన్ చేసారు. అక్కడ ఫంక్షన్ లో నిముష నిముషానికి ఏమి జరిగిందో మెన్షన్ చేస్తూ ఐటం పెట్టారు. తెలుగు హీరో కాబట్టి...తెలుగు ఛానెల్స్ కవర్ చేయటం కామన్..అలాంటిది నేషనల్ మీడియా కవర్ చేయటాన్ని బట్టి పవన్ ఇమేజ్ అంచనా వేసుకోమంటున్నారు పవన్ అభిమానులు.
ఇక గబ్బర్ సింగ్ ఆడియో చాలా ఘనంగా జరిగింది. పవన్‌కళ్యాణ్ ఈ పంక్షన్ లో మాట్లాడుతూ -''ప్రతి సినిమాకూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే శాయశక్తులా ప్రయత్నిస్తాం. అలాగే ఈ సినిమాకి కూడా అందరం పని చేశాం. మీ ఆదరణకు నోచుకుంటుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు. ''కాలేజ్ రోజుల్లో పవన్‌కళ్యాణ్ షూటింగ్‌ని గోడపై నుంచి ఎగిరెగిరి చూసేవాడ్ని. అలాంటి నేను ఆయనతో సినిమా చేయగలిగాను. యాక్షన్ అనగానే సెట్లోకి వచ్చి, కట్ చెప్పగానే వెళ్లిపోయే నటుడు కాదాయన. ఒక డైలాగ్ చెప్పాలన్నా, విలన్‌ని కొట్టాలన్నా.. అసహజంగా ఉంటే చెయ్యరు.ఆకలిగా ఉన్నవాళ్లు ఈ సినిమాని చూసి భుక్తాయాసంతో వెళతారు'' అని హరీష్‌శంకర్ చెప్పారు.
బండ్ల గణేష్‌బాబు మాట్లాడుతూ -'''తీన్‌మార్' అనుకున్న రేంజ్‌లో రీచ్ కాలేదు. చాలా బాధపడ్డాను. దాంతో నిన్ను మార్కెట్లో ఓ సూపర్ ప్రొడ్యూసర్‌గా నిలబెడతా అని పవన్‌కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్' నిర్మించే అవకాశం ఇచ్చారు. పవన్ అనే వ్యక్తి ఓ వ్యసనం. అలవాటు చేసుకుంటే చచ్చేదాకా వదలం'' అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. ఈ వేడుకలో ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి, దిల్‌రాజు, అల్లు అర్జున్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఇక ఇప్పటికే రిలీజైన పాటలు అంతటా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఏ ఛానెల్ తిప్పినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సాహితిగారు రాసిన ఐటం సాంగ్ కెవ్వు కేక అందరినీ కేక పెట్టిస్తోంది. దేవి, మలైకా అరోరా ఈ పాటలో డాన్స్ చేయనున్నారని తెలస్తోంది. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రం కావటంతో అంతటా ఈ సినిమాపై దృష్టి ఉంది. సల్మాన్ ఖాన్ సైతం పవన్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడని సమాచారం.


Click it and Unblock the Notifications











