twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.50 నోటుపై పవన్‌ చిత్రం.. కేసు

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : పవన్‌ కల్యాణ్‌ చిత్రంతో ఉన్న యాభై రూపాయల నోటును జనసేన పార్టీకి చెందిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేయడంపై ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ అందింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల పవన్‌ చిత్రంతో కూడిన యాభై రూపాయల నోటును జనసేనకు చెందిన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టుచేశారు.

    వందేళ్ల క్రితం పవన్‌ కల్యాణ్‌ పుట్టిఉంటే.. పచ్చ నోటుపై ఆయన చిత్రాన్ని ముద్రించేవారనే వ్యాఖ్యలు దానికింద ఉన్నాయి. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ ఎల్బీనగర్‌ చంద్రపురికాలనీకి చెందిన బాలరాజు అనే వ్యక్తి హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్‌తో కలిసి ఎల్బీనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

    Pawan Kalyan image on Rs.50 note: Case booked in Hyd

    గాంధీతో పవన్‌ కల్యాణ్‌ను పోల్చడమంటే ఆ మహానుభావుడిని కించపరచడమేననీ.. దీనిపై కేసు నమోదుచేయాలంటూ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

    ఇక పవన్ అభిమానులు ఈ విషయమై తమ ఫేస్ బుక్ ఖాతాలలో పోస్ట్ లు పెడుతున్నారు. ఎక్కడ ఈ ఫొటో తో కూడిన న్యూస్ ఉన్నా తీసేమని తమ తోటి అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీడియోలో సైతం ఈ వార్త ప్రముఖంగా రావటంతో చాలా మంది ఈ విషయమై విమర్శలు చేస్తున్నారు.

    English summary
    A currency note with Pavan Kalyan image went viral in social media. Balaraju and Arun, lawyers from Hyderabad lodged a complaint on Pawan Kalyan, alleging that by placing Pawan Kalyan image in place of Gandhiji on Rs.50 note, Mahatma was insulted. The image of a Rs.50 note, posted on Facebook triggered the controversy. It was written that if Pawan Kalyan would have born 50 years ago, his image would have been in Gandhi's place. The lawyers demanded that the image should be removed from the Facebook immediately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X