పవర్ స్టార్ నమ్మకం నిలబెడతానంటున్న విలన్
పవర్ స్టార్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అంటున్నాడు 'గబ్బర్ సింగ్'లో విలన్ గా నటిస్తున్న అభిమన్యు సింగ్. రక్త చరిత్ర సినిమాలో అతి భయంకరమైన వ్యక్తిగా నటించిన అభిమన్యు సింగ్ కి విలన్ కేటగిరీలో మంచి మార్కులే పడ్డాయి. అభిమన్యు సింగ్ క్రూరత్వంపై మనసు పడ్డ పవన్ కళ్యాణ్ ఏరి కోరి మరీ అతన్ని ఇందులో విలన్ గా పెట్టించాడు.
తన పాత్రపై అభిమన్యు సింగ్ మాట్లాడుతూ....'పెద్ద హీరో, భారీ బడ్డెట్ సినిమా. తాను గతంలో చేసిన దానికి మరింత పరిణితి చెంది నటించడానికి ట్రై చేస్తున్నా. హిందీలో సోనూసూద్ పోషించిన పాత్రకు ఏ మాత్రం తీసిపోకుండా నేను ఈ సినిమాలో నటిస్తున్నా' అని తెలిపారు.
పవన్, శృతి హాసన్ జంటగా నిటిస్తున్న ఈ చిత్రానికి హారిష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తీన్ మార్ చిత్ర నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఇక్కడ పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ జరిగింది. జనవరి రెండో వారం నుంచి మరొక షెడ్యూల్ మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











