అఫీషియల్.. అదిరిపోయే రీమేక్‌తో పవన్ రీ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?

Recommended Video

Pawan Kalyan In Pink Remake || దర్శకుడు ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తిరిగి వెండితెరను ఏలబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రంతో చివరగా కనిపించిన పవన్ కళ్యాణ్.. అటుపై పూర్తి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. జనసేన పార్టీని స్థాపించి సామాజిక మార్పు కోసం ప్రయత్నించాడు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవివచూసిన జనసేన పార్టీ అంచనాలు తలకిందులయ్యాయి. తమ ప్రియతమ నేత, జనసేనాని రెండు చోట్లా గెలవకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

రీఎంట్రీపై వార్తలు..

రీఎంట్రీపై వార్తలు..

అయితే రాజకీయాల పరంగా కాస్త బిజీగా ఉన్న పవన్.. సినిమాలపై దృష్టి సారించలేదు. పైగా పూర్తి సమాయాన్ని రాజకీయాలకే కేటాయిస్తాని చెపుకొచ్చాడు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాల్లోకి వస్తారనే వార్తలు మాత్రం నిరంతరం వస్తూనే ఉండేవి. అవన్నీ రూమర్సేనని ఖండించినా.. వార్తలు రావడం మాత్రం ఆగేవి కావు.

 అదిరిపోయే రీమేక్‌లో..

అదిరిపోయే రీమేక్‌లో..

అయితే తమ అభిమాన హీరోను వెండితెరపై చూడాలన్న కోరిక మాత్రం ఫ్యాన్స్‌కు అలాగే మిగిలిపోతూ వచ్చింది. ఒక్క సినిమా అయినా చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతూ వస్తున్నారు. ప్రస్తుతం వారి కోరిక నెరవేరేందుకు సమయం వచ్చింది. పింక్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటించబోతోన్నట్లు అధికారికంగా ప్రకటించేశారు.

దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా..

దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా..

ఈ హిందీ చిత్రాన్ని అజిత్ తమిళంలో నేర్కొండ పార్వై అని తీసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఇక తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నాడు.

సంబరాల్లో మునిగిన మెగాభిమానులు..

సంబరాల్లో మునిగిన మెగాభిమానులు..

ఇక ఈ వార్తతో మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. నవంబర్ నెలలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వార్తల వరకే పరిమితమైన రీఎంట్రీ విషయం.. చివరకు నిజమయ్యే సరికి మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించాలని ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X