Pawan Kalyan వారణాసిలో పవన్ కల్యాణ్.. భార్యతో కలిసి నరేంద్రమోదీ కోసం..!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక అందరి చూపు దేశంలో జరిగే ఎన్నికలపైనే పడింది. ఏపీలో ఓట్ల పండుగ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి వారణాసికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యం అని జోస్యం చెప్పారు. వారణాసిలో పవన్ పర్యటన ఎందుకు? అనే వివరాల్లోకి వెళితే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అంటే చెప్పలేనంత అభిమానం. పలు సందర్భాల్లో వారిద్దరి మధ్య అనుబంధం బహిరంగంగా కనిపించింది. పలు సందర్భాల్లో నా కోసం పవన్ కల్యాణ్ ఉన్నాడని స్వయంగా ఆమె మోదీ చెప్పడం తెలిసిందే.

Pawan Kalyan in Varanasi for Narendra Modi Nomination along with Wife Anna Lezhneva

ఇక ఇటీవల ఏపీలోప్రచారానికి వచ్చిన మోదీకి పాదాభివందనం చేయగా.. పవన్ కల్యాణ్‌ను అలా చేయవద్దని వారించాడు. మరోమారు ఇలాంటి పని చేయవద్దని పవన్‌ను సున్నితంగా మందలిచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇక ఆంధ్రాలో తెలుగుదేశంతో బిజేపీ పోత్తు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు అందరికి తెలిసిందే. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. మోదీని చాలా విషయాల్లో ఒప్పించడంలో ఆయన సఫలమయ్యారు. అలాంటి తన అభిమాన నాయకుడు వారణాసిలో నామినేషన్ వేస్తున్న క్రమంలో భార్యతో కలిసి ఆ వేడుకలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి అక్కడికి చేరుకొన్నారు.

Pawan Kalyan in Varanasi for Narendra Modi Nomination along with Wife Anna Lezhneva

వారణాసి ఎయిర్‌పోర్టులో జాతీయ మీడియాతో మాట్లాడుతూ..ఎన్డీఏకు పూర్తిస్థాయి విజయం దక్కుతుంది. మోడీ నామినేసన్ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉంది. ఆయనకు మద్దతు తెలియజేయడం, విషెస్ అందజేయడం నాకు గర్వంగా ఉంది. మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నాడు. ఆయన సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X