twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ హార్ట్ వాక్ (ఫోటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు హృదయ స్పందన ఫౌండేషన్‌ హైదరాబాద్‌లో వాక్‌ నిర్వహించింది. నెక్లెస్‌ రోడ్డులోని పీవీఘాట్‌ నుంచి పీపుల్స్‌ ప్లాజా వరకు నిర్వహించిన ఈ నడకనకు సినీహీరో పవన్‌ కల్యాణ్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ ప్రారంభించారు.

    'వాక్‌ఫర్‌ హార్ట్‌-రిచ్‌ ఫర్‌ హార్ట్‌' పేరిట ఉదయం ప్రారంభమైన నడక కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటు వైద్యులు పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొని గుండె వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.

    నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సినీ హీరో వపన్‌కల్యాణ్‌ చెప్పారు. ఆరోగ్యం బాగుంటే మంచి ఆలోచనలతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలమన్నారు. ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండె వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చన్నారు.

    స్లైడ్ షోలో...వాక్ పోటోలు

    అవగాహన కోసం...

    అవగాహన కోసం...

    గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు హృదయ స్పందన ఫౌండేషన్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వాక్ నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన ఈ నడకను పవన్ కల్యాణ్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మలు ప్రారంభించారు.

    తనదైన శైలిలో..

    తనదైన శైలిలో..

    ప్రభుత్వం చేయాల్సిన పనులను స్వచ్చంధ సంస్థలు చేస్తున్నాయంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు, ప్రభుత్వాలకు తీరిక లేకుండా పోతోందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

    తప్పించుకోవచ్చు...

    తప్పించుకోవచ్చు...

    నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యం బాగుంటే మంచి ఆలోచనలతో సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్లగలమన్నారు. ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం ద్వారా గుండె వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునన్నారు.

    గాలం వేసారు కానీ...

    గాలం వేసారు కానీ...

    డబ్బే సర్వస్వం కాదని పవన్ కళ్యాణ్ చాటి చెప్పారని ఇపుడు మెగా ఫ్యాన్స్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది. ఇలాంటి చర్చ ప్రచారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుండటమే. పవన్ కళ్యాణ్‌కు బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యూ టీవీ మోషన్ పిక్చర్స్ 60 కోట్లతో గాలం వేసే ప్రయత్నం చేసిందని ఆ వార్తల సారాంశం.

    తెగేసి చెప్పారు..

    తెగేసి చెప్పారు..

    పవన్ కళ్యాణ్ తమ బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయడానికి రూ. 60 కోట్లు యూ టీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఆఫర్ చేసిందని, అయితే పవన్ కళ్యాణ్ ఆ ఆఫర్ తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన అభిరుచి ప్రకారమే సినిమాలు చేస్తానే తప్ప ఇలా గంపగుత్తగా ఇచ్చేకోట్ల ఆఫర్ల కోసం తాను సినిమాలు చేయనని పవన్ తెగేసి చెప్పినట్లు సమాచారం.

    రెండు ప్రాజెక్టులు..

    రెండు ప్రాజెక్టులు..

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా రెండు ప్రాజెక్టులకు సైన్ చేసారు. అందులో ఒకటి సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గబ్బర్ సింగ్-2'. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ఫిల్మ్ నగర్లో నిరాడంబరంగా ప్రారంభమైంది. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.

    ఓ మైగాడ్ కూడా...

    ఓ మైగాడ్ కూడా...

    మరో మల్టీ స్టారర్ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈచిత్రంలో వెంకటేష్‌తో కలిసి నటించబోతున్నారు పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ లార్డ్ శ్రీకృష్ణా పాత్రలో కనిపించనున్నారు.

    వీరు కూడా...

    వీరు కూడా...

    మహేష్ బాబుతో వరసగా దూకుడు, 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు చేస్తున్న నిర్మాతలు 14 రీల్స్ వారు త్వరలో పవన్ తో సినిమాలు చేయనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో అదే బ్యానర్ వారు మూడు చిత్రాలు డీల్ కుదుర్చుకోనున్నారని తెలుస్తోంది. రెమ్యునేషన్ గా మూడు సినిమాలకు కలిపి 82 కోట్లు ఆఫర్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అత్తారింటికి దారేది తో మార్కెట్ పరంగా ఓ రేంజికి వెళ్లిన పవన్ తో వారు వరసగా చిత్రాలు చేయాలని భావించి ఈ ఆఫర్ చేసారని చెప్తున్నారు. అయితే పవన్ ఓకే చేసాడో లేదా అనేది తెలయరాలేదు.

    ఓరి దేముడా

    ఓరి దేముడా

    బాలీవుడ్ సూపర్ హిట్ ‘ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి ‘ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.

    కృష్ణుడుగా...

    కృష్ణుడుగా...

    బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు. కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు.

    దసరాకే...

    దసరాకే...

    పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోపై, అతని పర్శనల్ లైప్, ప్రొఫెషినల్ లైఫ్ పై అనేక రూమర్స్ వస్తూంటాయి. అయితే ఈ మధ్యన 'గబ్బర్‌సింగ్‌ 2'సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వచ్చాయి. దాన్ని ఖండించటం కన్నా ఓపినింగ్ పెట్టి సినిమా ప్రారభించటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చే పూజ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎందుకంటే చిత్రం ముహూర్తం జరిగినా షూటింగ్ మే నెల నుంచి మాత్రమే జరగనుంది. దసరాకు సినిమాని రిలీజ్ చేస్తారు.

    వాక్ లో ఆకర్షణ పవనే..

    వాక్ లో ఆకర్షణ పవనే..

    ఈ వాక్ ఫర్ హార్ట్ రిచ్ ఫర్ హార్ట్ పేరిట ఉదయం ప్రారంభమైన ఈ నడకలో కళాశాల విద్యార్థులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పవన్ కల్యాణ్‌‌ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయనను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.

    English summary
    Pawan Kalyan has become a huge name all over the state. Earlier today, he inaugurated a 5 K heart walk run that was organized by Hrudaya Foundation at Necklace Road in Secunderabad. Pawan was accompanied by his director friend Trivikram Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X