For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం: అతడు చేసిన పని వల్లే.. డాక్టర్లు ఏం చెప్పారంటే!

  |

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తనదైన ముద్రను వేస్తూ వస్తున్నాడు. మరీ ముఖ్యంగా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. రాజకీయంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. దీంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ కారణంగానే పవన్ కల్యాణ్‌కు అభిమానుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగిపోతోంది. ఆయనను దేవుడిగా భావించే వాళ్లు కొన్ని లక్షల మందే ఉన్నారు. అయితే, ఇదే ఒక్కోసారి పవన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవర్ స్టార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  రీఎంట్రీలో రచ్చ.. ఆ సినిమాలు

  రీఎంట్రీలో రచ్చ.. ఆ సినిమాలు

  దాదాపు మూడేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' అనే చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఫలితంతో ఫుల్ ఖుషీగా ఉన్న ఈ స్టార్ హీరో ఆ వెంటనే వరుసగా పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇందులో ఇటీవలే 'భీమ్లా నాయక్' అనే సినిమా విడుదలైంది. ఇది కూడా భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసుకుంది.

  లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

  పట్టాలపై రెండు.. ఇంకోటి కూడా

  పట్టాలపై రెండు.. ఇంకోటి కూడా

  ప్రస్తుతం పవన్ కల్యాణ్.. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ పూర్తైంది. దీనితో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాను చేస్తున్నాడు. వీటితో పాటు తమిళ చిత్రం 'వినోదయ సీతమ్'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు.

  జనసేన కార్యక్రమాలపై ఫోకస్

  జనసేన కార్యక్రమాలపై ఫోకస్

  కొన్నేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. దీనికోసమే గతంలో సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే, కొంత కాలంగా అతడు సినిమాలు చేసుకుంటూ మధ్యలో ఈ పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు మరింత స్పీడు పెంచిన జనసేనాని.. ఎక్కువగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ బిజీగా మారాడు.

  దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!

  పబ్లిక్ మీటింగ్‌తో హీరోకు గాయం

  పబ్లిక్ మీటింగ్‌తో హీరోకు గాయం

  తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నాడు. అందులో ఆయన మాట్లాడుతోన్న సమయంలో ఓ అభిమాని స్టేజ్ మీదకు దూసుకెళ్లాడు. అప్పుడు పవన్ పాదాలను తాకే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలోనే జనసేనాని నడుముకు గాయం అయింది. దీంతో కాసేపు బ్యాక్‌ను పట్టుకుని పవన్ విళవిళలాడిపోవడం కనిపించింది.

  మీ అభిమానం నన్ను చంపొద్దు

  మీ అభిమానం నన్ను చంపొద్దు

  ఈ సంఘటన జరిగిన తర్వాత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 'ఒక్కోసారి మీ అభిమానం వల్ల నాకు గాయాలు అవుతున్నాయి. మీ అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, ఒకేసారి ఇలా కాళ్ల మీద పడిపోతే ఎలా? దేశం కోసం పని చేసేవాడిని అర్థం చేసుకోండి. మీ అభిమానం నన్ను ఆరోగ్యంగా ఉంచాలి కానీ.. అనారోగ్యంగా నన్ను చంపేయకూడదు' అంటూ చెప్పుకొచ్చాడు.

  నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!

  పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం

  పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం


  జనసేన పార్టీ నిర్వహించిన మీటింగ్‌లో గాయపడిన పవన్ కల్యాణ్‌కు ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభిమాని వల్ల తగిలిన గాయంతో పాటు వర్షంలో తడవడంతో పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం వచ్చిందట. అయినప్పటికీ ఒకరోజు జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత మరింత అస్వస్థతకు గురయ్యాడని టాక్.

  హెల్త్‌పై డాక్టర్లు ఏం చెప్పారంటే

  హెల్త్‌పై డాక్టర్లు ఏం చెప్పారంటే

  తాజా సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరం, వెన్నునొప్పితో బాధ పడుతున్నాడట. దీంతో ఆయన ఇంట్లోనే వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇక, జనసేనాని పరీక్షించిన డాక్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారని తెలిసింది. అంతేకాదు, మూడు నుంచి నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోమని పవన్‌కు సూచించారని అంటున్నారు.

  English summary
  Power Star Pawan Kalyan Recently Participated in Janasena Public Meeting. Fan Tryed to Touching His Feet On Stage. Then Pawan Got Injured.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X