పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే తొలిసారి! (అఫీషియల్ ప్రకటన)

ఈ విషయమై ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యుల నుండి అఫీషియల్ సమాచారం అందింది. గబ్బర్ సింగ్ 2 చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్, ప్రొడక్షన్ వర్క్ శర వేగంగా జరుగుతోంది. హిందీ చిత్రం 'ఓ మై గాడ్' చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కబోయే చిత్రంలో పవన్ కళ్యాణ్ వెంకటేష్‌తో కలిసి నటించబోతున్నారు.
'ఓ మై గాడ్' తెలుగు రీమేక్‌తో పాటు, గబ్బర్ సింగ్-2 చిత్రాలు షెడ్యూల్స్‌కు అనుగుణంగా షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు మాత్రమే డేట్స్ కేటాయించారు. త్వరలో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.
ఓమైగాడ్ రీమేక్ చిత్రానికి 'ఓరి దేవుడా' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్‌లో అక్షయ్ కుమార్ పోషించిన కృష్ణుడి పాత్రను పవన్ కళ్యాణ్ పోషించనున్నాడు. పరేష్ రావల్ పోషించిన పాత్రలో వెంకటేష్ నటించనున్నాడు. 'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











