For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా గురువు: పవన్‌పై రేణుదేశాయ్ ఆసక్తికర కామెంట్

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.....ఈ మధ్య ట్విట్టర్లో ఆయన గురించి పలు వ్యాఖ్యలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దర్శక నిర్మాతగా మారిన రేణు దేశాయ్..... పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా తన తొలి డైరెక్షనల్ మూవీ 'ఇష్క్ వాలా లవ్' చిత్రం ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  రేపు 'ఇష్క్ వాలా లవ్' టీజర్ విడుదలను పురస్కరించుకుని తాజాగా రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నాకు గురువు లాంటి వారని, ఆయన ద్వారానే సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలు నేర్చుకున్నానని, తాను ఫిల్మ్ మేకర్‌గా మారడం వెనక ప్రభావం ఉందని పేర్కొన్నారు.

  'అనుకోకుండా జరిగే కొన్ని పరిణామాలు మన ఆలోచనలకు దేవుడు ఇచ్చే సమాధానాలని ఎక్కడో చదివాను. దర్శకురాలిగా నా తొలి చిత్రం టీజర్ సెప్టెంబర్ 2న విడుదల అవుతుండటం అనుకోకుండా జరిగిన పరిణామమే. 1999 నుండి నేను పవన్ కళ్యాణ్ గారి నుండి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను. ఆయన నాకు దొరికిన బెస్ట్ టీచర్. ఈ విషయంలో నేను తనకు పెద్ద థాంక్స్ చెప్పాలి. ఆగస్టు 26న నా ఫిల్మ్ టీజర్ విడుదల కావాల్సి ఉండగా టెక్నికల్ సమస్యల వల్ల సెప్టెంబర్ 2న విడుదల అవుతుడటం దేవుడి నుండి నాకు అందిన స్ట్రాంగ్ సిగ్నల్‌లా భావిస్తూ...మరోసారి సినిమాను ఇష్టంగా, సిన్సియర్‌గా తీయడం నేర్పిన పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెబుతున్నాను.' అని వ్యాఖ్యానించారు.

  బద్రి సినిమాతో మొదలు...

  బద్రి సినిమాతో మొదలు...

  మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

  పవన్ జీవితంలోకి...

  పవన్ జీవితంలోకి...

  ‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

  వైవాహిక జీవితం

  వైవాహిక జీవితం

  పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడక తప్పలేదు. సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగింది.

  విడిపోయారు...

  విడిపోయారు...

  నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు. తర్వాత ఆయనతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా, ఆద్యా అనే ఇద్దరు పిల్లకు తల్లయింది. ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమలో తన నిర్మాతగా, దర్శకురాలిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.

  ఇష్క వాలా లవ్

  ఇష్క వాలా లవ్

  ‘ఇష్క్ వాలా లవ్' బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. రేణు దేశాయ్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తోంది.

  English summary
  "I had read somewhere that co incidences r gods way of answering ur thoughts...its really & sincerely a Huge co incidence that the trailer of my directional debut is releasing on 2nd Sep. From 1999 I started learning my film making frm Pawan Kalyan garu. He is truly the best teacher I could ever get. I always wanted to thank him for the perfect film making course I got from him. The trailer was supposed to be ready for a 26th Aug launch, but due to some technical problem it got delayed to 2nd Sep. So I take it as an sign frm God to release my debut directions Trailer on his b'day & thank him again for teaching me how to make true, sincere& passionate films." Renu Desai said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X