పవన్ టార్గెట్... 2019 ఎన్నికల్లోపు 3 నిమాలు
పవన్ టార్గెట్... 2019 ఎన్నికల్లోపు 3 నిమాలు
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వం రాధా కృష్ణ నిర్మాతగా ఓ సినిమా, తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఎఎం రత్నం నిర్మాణంలో మరో సినిమా కమిట్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాల రెగ్యులర్ షూటింగ్ 2017 జనవరి, ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ గ్యాపులో వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్.


Click it and Unblock the Notifications











