»   » ‘ఎవడు’ ఆడియోకు పవన్ కళ్యాణ్?

‘ఎవడు’ ఆడియోకు పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan and Ram Charan
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్రం ఆడియో ఈ నెల 30న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' చిత్రం షూటింగులో భాగంగా యూరఫ్ లో ఉన్న పవన్ 30వ తేదీ తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. అదే రోజు సాయంత్రం జరిగే ఆడియో వేడుకు హాజరవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ ఆడియో వేడుకకు చిరంజీవి కూడా హాజరు కావాల్సి ఉండగా ఉత్తరఖండ్ వరదల నేపథ్యంలో అందుకు సంబంధించిన పనుల పర్యవేక్షణలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.

'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై చివరి వారంలో 'ఎవడు' సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. బ్రిటిష్ మోడల్ అమీ జాక్స్ సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ఫుల్ సాంగ్ లీకైన సంగతి మరువక ముందే...తాజాగా మరో సాంగ్ లీకైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'చెలియా చెలియా' అంటూ సాగే ఆడియో ట్రాక్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. షూటింగ్ లొకేషన్లో ఈ సాంగు రికార్డ్ చేసి లీక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ మ్యూజిక్, ఈ సాంగు మ్యూజిక్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.

English summary
Ram Charan’s Yevadu movie audio will be released on June 30, 2013 in Hyderabad. Now the latest buzz is Power Star Pawan Kalyan will grace Yevadu audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu