Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
పవన్ వచ్చేస్తున్నాడు.. చొక్కాలు చింపుకొని చూద్దాం.. ఆమె ఆరోప్రాణం.. నితిన్ ఎమోషనల్
యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 'భీష్మ'. ఫిబ్రవరి 21 రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్లోనొి యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో వైభవంగా జరిగింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ వేడుకలో నితిన్ మాట్లాడుతూ..
ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో..
నా గత చిత్రానికి, ఈ సినిమాకూ దాదాపు ఏడాది గ్యాప్ ఉంది. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయ్యేవరకు సినిమా మొదలుపెట్టకూడని అనుకున్నాను. వెంకీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పేవరకు ఆగి అప్పుడు మొదలుపెట్టాం. ఫిబ్రవరి 21న సినిమా వస్తోంది. వెంకీ 'దిల్' సినిమాకు, నాకూ పెద్ద అభిమాని అంట. ఒక హీరోను ఫ్యాన్ ఊహించుకొని సినిమా తీస్తే ఎలా ఉంటుందో భీష్మ కూడా అలా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి, 'దిల్', 'సై' తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు అని నితిన్ పేర్కొన్నారు.
ఆకలి తీరడం ఖాయం..
నా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ 'డ్యాన్సన్నా.. డ్యాన్సన్నా' అని అడుగుతున్నారు. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్ చూసి అభిమానుల ఆకలి తీరుతుందని అనుకుంటున్నా. కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నా బెండు తీసేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బాగా చేయించారు. సెకండాఫ్ లో వచ్చే ఫైట్ ను ఫైట్ మాస్టర్ వెంకట్ అదరకొట్టేశారు. ఆ ఫైట్ లో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ నితిన్ తెలిపారు.
రోమాలు నిక్కబొడుచుకొనేలా
ఎమోషనల్ సీన్లకు, ఫైట్‌కు స్వరసాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఫోన్లో చూస్తుంటేనే రోమాలు నిక్కబొడుచుకొంటున్నాయి. ఈ సినిమాకు లైఫ్ లాగా నిలిచే సాంగ్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా తను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. కాసర్ల శ్యాం, శ్రీమణి, కృష్ణచైతన్య చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. నవీన్ నూలి బాగా ఎడిటింగ్ చేశాడు. నన్నూ, రష్మికను సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ చాలా అందంగా చూపించారు అని నితిన్ అన్నారు.
రష్మిక బ్యూటీ సీక్రెట్
నాకు బ్యూటీ టిప్స్ ఇచ్చేది బ్రహ్మాజీ గారైతే, రష్మిక ఇంత ఫిట్ గా, ఇంత బ్యూటీగా ఉండటానికి కారణం తను తీసుకొనే ఆహారం. అది సీక్రెట్. తను మంచి నటి. అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్ లో తను చేసిన డ్యాన్స్ చూసి షాకయ్యా. చాలా బాగా చేసింది. హార్డ్ వర్క్, డెడికేషన్ తో ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది. నాకు మంచి ఫ్రెండయ్యింది అని నితిన్ తెలిపారు. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట 'అ ఆ' చేసి, ఇప్పుడు ఈ సినిమా చేశాను. మూడో సినిమా 'రంగ్ దే' ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారని అన్నారు.
Recommended Video
నా భార్య ఆరోప్రాణం
నా లైఫ్ లో పంచ ప్రాణాలు.. మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నాకాబోయే భార్య ఆరో ప్రాణం కాబోతోంది. త్రివిక్రమ్ గారితో పరిచయం కావడం, 'అ ఆ' సినిమా చెయ్యడం, నా జీవితంలో ఆయన ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాల ఉంటే నా ధైర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మార్గదర్శకుడు. ఇక పవన్ కల్యాణ్ గారి గురించి చెప్పేదేముంది. ఆయన మేలో మనముందుకు రాబోతున్నారు. అందరం అప్పుడు చొక్కాలు చింపుకొని సినిమా చూద్దాం" అని చెప్పారు.