పవన్ కళ్యాణ్ అధ్బుతం అంటున్నాడు
పవన్ కళ్యాణ్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు అడవి శేషు. కర్మ చిత్రంతో తెలుగు తెరకు పరచయమైన శేషు తన తదుపరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేస్తూండటంతో చాలా ఆనందంగా ఉన్నాడు. అందులో నెగిటివ్ రోల్ చేస్తున్న శేషు కలకత్తా షెడ్యూల్ లో పాల్గొని వచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ అండ్ సూపర్బ్ అన్నారు. అలాగే యాక్టింగ్ స్కిల్స్ అద్బుతమని అన్నారు. తనుకు ఖుషీ అన్నా తొలిప్రేమ అన్నా చాలా ఇష్టమని అన్నారు.
ఈ చిత్రం ఐదు గురి జీవితాలకు సంబందించిన కథతో రూపుదిద్దుకుంటోందని తెలుస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పోషించే పాత్రలో కాస్త నెగటివ్ టచ్ కూడా కనిపిస్తుందని తెలుస్తోంది. అడవి శేషు, సంపత్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా జేన్ దియాస్, అంజలి లవేనియా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విష్ణు వర్దన్ చిత్రం భిళ్ళాకు ఫ్రీక్వెల్ గా దీనిని రూపొందించనున్నారు. ఆర్కా మీడియా, సంఘ మిత్ర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications