తన వల్ల కావడం లేదు.. అందుకే అన్నయ్యకు రంగంలోకి దింపుతున్న పవన్ కళ్యాణ్?

Recommended Video

Pawan Kalyan Going To Hand Over Key Responsibilities To Nagababu || Filmibeat Telugu

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దరించడానికి, వారికి మంచి చేయడానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చపెట్టే సినిమా రంగాన్ని సైతం వదులుకుని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి ఎంటరైన సంగతి తెలిసిందే. 'జనసేన' పార్టీ స్థాపించిన ఆయన గతేడాది నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. తను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలవ్వడంతో పాటు.... తన సోదరుడు నాగబాబుతో సహా 'జనసేన' పార్టీ నుంచి బరిలోకి దిగినవారంతా ఓడిపోయారు. కేవలం రాజోలు నుంచి ఒక ఎమ్మెల్యే గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు.

మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా...

మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా...

ఈ ఓటమితో ఏ మాత్రం కృంగిపోని పవన్ కళ్యాణ్.... పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావడం జనసేన పాలసీ కాదని, రాబోయే 25 ఏళ్లలో వ్యవస్థలో మార్పు తేవడమే టార్గెట్ అంటూ ఆయన పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు.

నాగబాబుకు కీలక బాధ్యతలు

నాగబాబుకు కీలక బాధ్యతలు

పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు సహాయం తీసుకుంటున్నాడు. ఈ మేరకు ఆయనకు కీలక పదవి అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, దాని నాయకత్వ బాధ్యతలను నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారట.

నాగబాబుకు మంచి అనుభవం

నాగబాబుకు మంచి అనుభవం

ఇలాంటి వ్యవహారాల్లో నాగబాబుకు మంచి అనుభవం ఉంది. సినిమా రంగంలో అన్నయ్య చిరంజీవికి చేదోడువాదోడుగా ఉంటూ మెగా అభిమానులను సమన్వయ పరచడం, వారితో సమావేశాలు నిర్వహించడం లాంటివి గతంలో చేశారు. ఈ నేపథ్యలో నాగబాబుకు పార్టీ సమన్వయ బాధ్యతలు అప్పగిస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.

అన్నీ చూసుకోవడం పవన్ కళ్యాణ్ వల్ల కావడం లేదు

అన్నీ చూసుకోవడం పవన్ కళ్యాణ్ వల్ల కావడం లేదు

క్షేత్రస్థాయిలో అందరు నాయకులను కలవడం పవన్ కళ్యాణ్‌కు సాధ్యపడటం లేదు. తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన అన్ని పనులు చూసుకోలేక పోతున్నారు. సోదరుడు నాగబాబు అయితే తనకు మరింత నమ్మకంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X