ఈ రోజే ఇజ్రాయిల్ కి పవన్ కళ్యాణ్ ప్రయాణం
పవన్ కళ్యాణ్ ఈ రోజు( శుక్రవారం) ఇజ్రాయెల్‌కు బయలుదేరుతున్నారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఆంగ్ల, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఆదిత్య ప్రొడక్షన్స్ అధినేత కొండా కృష్ణంరాజు నిర్మించే చిత్రం షూటింగ్ ఇజ్రాయెల్‌లో జరుగనుంది. అందునిమిత్తం పవన్ ప్రయాణం కట్టారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశానికి చెందిన జెరూసలేంలోని ఆలివ్ హిల్ తదితర లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ తో పాటు యూనిట్ సభ్యులు శుక్రవారం ఇజ్రాయెల్ కు బయలుదేరుతున్నారు.అక్కడికి వెళ్లిన తదనంతరమే ఈ చిత్ర నిర్మాణాన్ని జరుపదలిచినట్లు నిర్మాత కొండా కృష్ణంరాజు మీడియాకు తెలిపారు. ఇంతకుముందు ఆదిత్య ప్రొడక్షన్స్ పై కొండా కృష్ణంరాజు శ్రీరామదాసు, విజయేంద్రవర్మ చిత్రాలను నిర్మించారు. ఇక ఈ చిత్రానికి రచన: జె.కె.భారవి, ఫొటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, కళ: రవీంద్ర, మేకప్: క్రిస్టియానా టిన్‌ప్లే(యు.ఎస్.ఎ.), ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శేషు, నిర్మాత: కొండా కృష్ణంరాజు, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు.


Click it and Unblock the Notifications











