twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ నాకు వ్యతిరేకం కాదు: చిరంజీవి

    By Srikanya
    |

    హైదరాబాద్: ''ఒక గర్భం నుంచి పుట్టినవాళ్లం. అనుబంధాలు పెనవేసుకొన్నవాళ్లం. మేమంతా ఒక్కటే. మా మధ్య విబేధాలు ఉన్నాయని ఎక్కడెక్కడో, ఎవరెవరో చెప్పుకొంటున్న మాటలు నిజం అనుకొంటే పొరపాటు. అంత బలహీనమైన బంధం మాది కాదు. రాజకీయం మా జీవితం కాదు. రాజకీయాల్లో కూడా తను నాకు వ్యతిరేకం కాదు'' అని తేల్చి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

    Pawan Kalyan is like my son : Chiranjeevi

    అలాగే... ''ప్రజలకు సేవ చేయడానికి మరో మార్గం ఎంచుకొన్నాడు. జనసేవే లక్ష్యంగా 'జనసేన' పెట్టాడు. అది తప్పు అని నేను అనుకోవాలా? పవన్‌కల్యాణ్‌ నాకు మరో బిడ్డ. తనకంటూ ఎవరికీ సాధ్యం కాని ఓ ఇమేజ్‌ ఏర్పాటు చేసుకొన్నాడు. చరణ్‌ ఒకరకంగా, పవన్‌ మరోరకంగా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకోవడాన్ని చూస్తూ ఎంత సంతోషిస్తున్నానో మాటల్లో చెప్పలేను'' అన్నారు.

    ఇటీవలకాలంలో పరిశ్రమలో గమనించిన ప్రధాన విషయాలు గురించి మాట్లాడుతూ...నిర్మాణ వ్యయం అదుపులో ఉండటం లేదు. ఇదివరకటి కాలంలో మేం ప్రతీ విభాగంపైనా నిఘా వేసి ఒక వాచ్‌ డాగ్‌లా ఉంటూ సినిమా చేసేవాళ్లం. నిర్మాతకి ఎలాగైనా డబ్బు మిగలాలని ఆలోచించేవాళ్లం. ఆ ఆర్థిక క్రమశిక్షణ ఎక్కడా కనిపించడం లేదు. మాకు ఎంతని చూసుకొంటున్నారు తప్ప నిర్మాత గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. నా 150వ సినిమా మేమే సొంతంగా నిర్మించాలనుకోవడానికి కారణం కూడా అదే అన్నారు.

    English summary
    
 “Pawan Kalyan is like my son. We share a very close bond and if people think we have differences, they are mistaken. He chose a different political path to serve people and that is ok. I do not see anything wrong with that”, Chiranjeevi said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X