పంజా విసురుతున్న పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కిరీటం అధిరోహిస్తాడా?
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోనికి అడుగు పెట్టిన తర్వాత ఆపోస్ట్ ఖాళీ అయ్యింది. మెగాస్టార్ పోస్ట్ కి అతి చేరువలో ఉన్న వాళ్లలో అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకరు. స్వతహాగా ఎప్పుడు ఎమోషనల్ గా వుండే పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో యువరాజ్యం అధ్యక్షుడు గా పదవి చేపట్టీ ముందుండి నడిపించాడు. కానీ ఫలితాలు వెలువడిన తర్వాత అన్నగార్ని సిఎమ్ గా చూసే వరకు రాజకీయాలలోనికి రాను అని ప్రతిజ్ఝ చేశాడు.
ప్రస్తుతం రాజకీయాలను ప్రక్కన బెట్టి సినిమాల వైపుగా తన పంథా మార్చుకున్నాడు. పులి సినిమా షూటింగ్ లో పాల్గొంటూ, ఎక్కడా రాజకీయ ప్రస్తావన రాకుండా పంజా విసరడానికి సిద్ధమవుతున్నాడు. పవన్ ఈ సినిమా కోసం తన పని తాను చేసుకుంటూ, ఈ సినిమా విజయంతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాయడానికి సిద్దమవుతున్నాడని, అందుకోసం ఎంతో సంకల్పంతో ఇన్ వాల్వ్ అవుతున్నాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. మరి చూద్దాం! 'పులి" పంజా విసిరి మెగాస్టార్ కిరీటం ను అధిరోహిస్తాడేమో!


Click it and Unblock the Notifications











