»   » చిరంజీవి కోసమే... పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నాడట!

చిరంజీవి కోసమే... పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' ప్రాజెక్టు ఈ నెలా ఖరును ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తాజా పరిస్థితి చూస్తే ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని టాక్. ఉన్నట్టుండి ఈ మార్పుకు కారణం చిరంజీవి 150వ సినిమా ప్రకటన వెలువడటమే అంటున్నారు.

వాస్తవానికి గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించి సంక్రాంతి నాటికి విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అంతలోనే చిరంజీవి సినిమా ప్రకటన రావడం, ఈ చిత్రాన్నికూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేయడంతో....తన సినిమా అన్నయ్య సినిమాకు పోటీ కాకూడదనే కారణంగా పవన్ కళ్యాణ్ కావాలని గబ్బర్ సింగ్-2ను ఆలస్యం చేస్తున్నారని టాక్.

పవన్ కళ్యాణ్ భారీగా గడ్డం పెంచుకుని ఉండటాన్ని బట్టి...ఆయన రైతుల తరుపున పోరాటానికి సిద్దమవుతున్నారని, దీక్ష చేయడానికి రెడీ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కారణాలేమైనా ‘గబ్బర్ సింగ్-2' చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు.

Pawan Kalyan-Chiranjeevi

చిరంజీవి 150వ సినిమా విషయానికొస్తే...ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కాబోతోంది. ఇటీవల చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేసారు. 150వ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు, ఆగస్టులో సినిమా ప్రారంభం అవుతుందని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. తన కుమారుడు రామ్ చరణ్ తో పాటు బండ్ల గణేష్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటారని తెలిపారు. ఆగస్టులో అంటే చిరంజీవి జన్మదినం రోజు ప్రారంభం అవుతుందని స్పష్టం అవుతోంది. 150వ సినిమాపై స్వయంగా చిరంజీవి స్పందించడంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు. సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

కాపీ వివాదం... చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

English summary
Pawan Kalyan is in no mood to clash with his brother’s landmark movie so that the shooting of Gabbar Singh 2 will be delayed further now.
Please Wait while comments are loading...