పవన్ కళ్యాణ్ దేవుడా? అయితే వారికి పిచ్చి, చెడు చేస్తుంది: కత్తి మహేష్
సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా దేవుడు అంటే వెంటనే వారిని పిచ్చివారిగా భావించాలని మహేష్ కత్తి సూచించారు.
Recommended Video

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ రాజకీయ ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కత్తి మహేష్ పాల్గొన్నారు.

దేవుడు అంటే వారిని మెంటల్ డాక్టర్‌కు చూపించండి
ఎవరైనా తల్లిదండ్రులు, తమ బిడ్డ నోటి నుంచి 'పవన్ కళ్యాణ్ దేవుడు' అన్న మాటను వింటే, వెంటనే వారిని మెంటల్ డాక్టర్‌కు చూపించాలని మహేష్ కత్తి సంచలన కామెంట్స్ చేశారు.

సినిమా నటుడు దేవుడు ఎలా అవుతాడు?
సినీ నటుడు కేవలం నటించే వ్యక్తి మాత్రమేనని, దేవుడు ఎలా అవుతాడని కత్తి మహేష్ ప్రశ్నించారు. ఒక సినిమా విషయం తీసుకుంటే కథ రాసేవాళ్లు వారే ఉంటారు. డ్యాన్స్ చేయించే వాళ్లు వేరే ఉంటారు. దర్శకత్వం మరొకరు చేస్తారు. వారు చెప్పిన విధంగా నటిస్తూ తెరపై కనిపించే వ్యక్తి హీరో. అటువంటి వ్యక్తిని దేవుడిగా భావించడం పిచ్చి కాక మరేమిటి? అని మహేష్ కత్తి అన్నారు.

వారి ఉన్మాదం సమాజానికి చెడు చేస్తుంది
పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కొలుస్తున్న వారిలో ఉన్మాదం తీవ్రస్థాయిలో ఉందని, ఇది సమాజానికి చెడు చేస్తుందని ఈ సందర్భంగా కత్తి మహేష్ వ్యాఖ్యానించారు. మిగతా హీరోల అభిమానుల కంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే ఉన్మాదం ఎక్కువ ఉందన్నారు.

మళ్లీ ముదురుతున్న వివాదం
ఆ మధ్య పవన్ కళ్యాణ్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ మరోసారి విమర్శలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుండటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ వివాదం ముదిరి ఎంత వరకు వెలుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











