పవన్ చిత్రం టైటిల్ పై నిర్మాత ప్రకటన
ఈ చిత్రానికి ఇంతవరకూ అధికారికంగా ఏ టైటిల్‌నూ ప్రకటించలేదు. అయినా కూడా 'షాడో', 'కాళి', 'తిలక్', 'పటేల్' టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇవేమీ మా టైటిల్స్ కావు. విజయదశమి పర్వదినం నాడు ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటించబోతున్నాం అంటున్నారు నిర్మాతలు తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ. పవన్‌కల్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థల ఆధ్వర్యంలో తిరుమలశెట్టి నీలిమ, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సారాజేన్ డయాస్, అంజలీ లావానియాహీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం కి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సందర్బంగా నిర్మాతలు ఇలా స్పందిస్తూ ప్రకటన చేసారు. అలాగే ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయబోతున్నాం. ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం తయారవుతోంది. తమిళంలో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్ ఈ చిత్రాన్ని సరికొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నారు. పవన్‌కల్యాణ్ పాత్ర చిత్రణ న్యూలుక్‌తో స్టైలిష్‌గా వుంటుంది. అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఫిరోజ్‌ఖాన్ నృత్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, సారాజేన్ డయాస్‌పై ఓ పాట చిత్రీకరిస్తున్నాం. ఇంకా రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. నవంబర్‌లో ఆడియో, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. జాకీష్రాఫ్, అడవి శేష్, అతుల్ కులకర్ణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, అలీ, సుబ్బరాజు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్‌కోడా, కెమెరా: పి.ఎస్.వినోద్, కూర్పు: ఎం.శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, కళ: సునీల్‌బాబు.


Click it and Unblock the Notifications











