పవన్ కళ్యాణ్ టైటిల్ రగడ

By Srikanya

పవన్ కళ్యాణ్ కు టైటిల్స్ విషయంలో ఒక టేస్ట్ ఉండేది.అంతేకాదు తన ఏం పేరు కన్ఫార్మ్ చేస్తే దాన్ని నిర్మాతలు, దర్శకులు ఓకే చేసే పరిస్థితి ఉండేది. కానీ వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో పవన్ కు కాస్త టెన్షన్ పడుతున్నట్లు కనపుడుతోంది.ఎందుకంటే తమిళ దర్శకుడు విష్ణువర్దన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా టైటిల్ ను షాడోగా నిర్ణయించుకున్నారు. ఈ టైటిల్ పవన్ కు నచ్చలేదట. కాళీ అని సజెస్ట్ చేసారట పవన్. దాన్ని నిర్మాతలు ఒప్పుకోలేదు. అది కాస్త తిలక్ గా కొంతమంది ప్రచారం జరిగింది. ఈ టైటిల్ దర్శకుడికి నచ్చలేదు. చివరకు నిర్మాతలే మీడియాకు త్వరలోనే టైటిల్ వివరాలు చెప్తామని,దయటేసి అనవసరంగా రాద్ధాంతం పెట్టవద్దని కోరారు. అయితే ఏ టైటిల్ అనేది మరోనెలరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇంతకు ముందు ఎప్పుడూ పవన్ సినిమాకు ఇలా టైటిల్ సమస్య ఎదురుకాలేదు. ఈ చిత్రానికి నీలిమా తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ నిర్మాతలు . ఈ కాంబినేషన్ పై నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అబ్బూరి రవి సంభాషణలన్నీ రాశాడు. యువన్ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం భిళ్ళాకి ప్రేక్వెల్ అంటే అసలు భిళ్ళా మాఫియాలోకి ఎలా ఎంటరయ్యాడు. నిల దొక్కుకునే సమయంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..అన్న ఏంగిల్ లో కథను తయారు చేయాడని తెలుస్తోంది. అయితే భిళ్ళాకి భిళ్ళా2కి పోలిక కేవలం క్యారెక్టర్ కంటిన్యూషనే అని చెప్తున్నారు. ఇక స్టైలిష్ టేకింగ్ తీసే విష్ణు ఈ చిత్రం ఎక్కువ భాగం కలకత్తాలో తీసారు. ఈ చిత్రానికి ఫైట్స్: శ్యామ్ కౌశల్, రచన: రాహుల్ కోడా, కెమెరా: టి.ఎస్.వినోద్, ఎడిటింగ్: శ్రీహరి ప్రసాద్, నిర్మాతలు: నీలిమ తిరుమలశెట్టి, యార్లగడ్డ శోభు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X