Chiranjeevi: మెగా ఫ్యామిలీకి అరుదైన ఘనత! పవన్ ప్లాన్ మామూలుగా లేదుగా..!!
Chiranjeevi: మెగా ఫ్యామిలీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతుందా? మెగా స్టార్ చిరంజీవి అరుదైన గౌరవం లభించబోతుందా? అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్యసభలో మెగా బ్రదర్ నాగబాబు మెగా ఫ్యామిలీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ, అనుహ్యంగా నాగబాబును రాష్ట్ర క్యాబినెట్ లోకి అడుగు పెడతారని కూటమి నాయకత్వం ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటంటే?
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన అవకాశాన్ని దక్కించుకోబోతున్నట్టుగా ఒక సమాచారం ఢిల్లీ సర్కిల్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు.టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. పూర్తిగా సినీ రంగంలోనే తన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో ఏంట్రీ ఇచ్చారు.

2024 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పే నాయకుడుగా మారారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెంబర్ గానే కాకుండా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు. ఈ తరుణంలో ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబును రాజసభ్యకు పంపించబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా ఏపీ అసెంబ్లీ నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది.
గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సినిమాల్లో బిజీబిజీగా ఉంటున్న చిరంజీవి రాజ్యసభలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. రాజ్యసభలో ప్రస్తుతం ఎనిమిది స్థానాలు ఖాళీలు ఉన్నాయి. 8 స్థానాల్లో భర్తీ చేసేటువంటి క్రమంలో ఎన్డీఏ సర్కార్ కీలకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంటుంది. రాజ్యసభలో బిజెపి అతి పెద్ద పార్టీగా ఉంది. రాష్ట్రపతి కోటలో 12 స్థానాలు నామినేట్ చేస్తారు అందులో నాలుగు స్థానాలు జులై నెలలో ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు స్థానాన్ని కూడా జనవరిలోపు భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది

ఈ రాజీనామా నేపథ్యంలో మొత్తం ఐదు స్థానానికి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కూడా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కంప్లీట్ అయింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఏకగ్రీవంగా రాష్ట్రపతి కోట పైన బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇమేజ్ కలిగినటువంటి వ్యక్తిగా .. పరపతి కలిగినటువంటి కథానాయకుడు. కానీ, గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. కానీ, సమాజ సేవ విషయంలో కూడా దాదాపు 25- 30 సంవత్సరాలుగా చిరంజీవి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇప్పటికే పవన్ కల్యాన్ ఈ అంశంపై బీజేపీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. అదే రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం. ఇప్పటికే రాష్ట్రపతి కోటాలో విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రంజన్ గొగోయ్, సుధామూర్తి వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు కావాలంటే.. ఆయా రంగంలో ఉన్నతులైతే సరిపోతుంది.సినీ రంగంలో చిరంజీవికి తిరుగులేదు. నామినేట్ కావడానికి బీజేపీ సభ్యత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి.. ఈ నిర్ణయం దాదాపు ఫైనల్ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ చిరంజీవికి ఈ పదవి దక్కుతే.. మూడు చట్ట
సభల్లో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ప్రాతినిథ్యం వచ్చిన ఘనత మెగా ఫ్యామిలికి దక్కుతోంది.


Click it and Unblock the Notifications











