»   » పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘రంగస్థలం’ విజయోత్సవం

పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘రంగస్థలం’ విజయోత్సవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. రెండో వారంలోనే రూ. 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్లో నాన్ బాహుబలి రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ టాప్ పొజిషన్‌‌కు చేరుకోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున విజయోత్సవం నిర్వహించాలని ప్లాన్ చేశారు.

హైదరాబాద్ యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగబోయే విజయోత్సవ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. భారీ ఎత్తున హాజరయ్యే మెగా అభిమానుల సమక్షంలో ఈ వేడుడుక గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నారు. ఏప్రిల్ 13న సాయంత్రం 6 గంటల నుండి విజయోత్సవ వేడుక ప్రారంభం కాబోతోంది. భారీగా అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Pawan Kalyan is the chief guest for Rangastalam movie Vijayostavam

రంగస్థలం సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ క్రియేట్ కావడం, విడుదల తర్వాత సూపర్ అంటూ స్ట్రాంగ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో తొలి 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఫస్ట్ వీకెండ్ తర్వాత వీక్ డేస్‌లో కలెక్షన్ల జోరు తగ్గుతుందని అనుకున్నప్పటికీ అలా జరుగకుండా మంచి వసూళ్లతో సినిమా తీసుకెళుతోంది. తొలి వారం(7డేస్) పూర్తయ్యే నాటికి ఈ చిత్రం రూ. 130 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. రెండో వారంలో 150 కోట్ల గ్రాస్ మార్కను దాటిన ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 95 కోట్లకు‌పైగా వసూలు చేసింది.

English summary
Ram Charan’s Rangastalam movie vijayostavam Event will be held on April 13th from 6 pm at Police Grounds, Yousufguda, Hyderabad. Pawan Kalyan is the chief guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X