పవన్ కళ్యాణ్ ఒరిజినల్ సూపర్ స్టార్ : సమంత
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒరిజినల్ సూపర్ స్టార్ అంటూ పొగిడేస్తుంది హాట్ హీరోయిన్ సమంత. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ ప్రకటన సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని మారియట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమంత ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్‌తో కలిసి 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మీడియా వారు పవన్ కళ్యాణ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి అడగ్గా...'అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఆయన ఒరిజినల్ సూపర్ స్టార్. సినిమాలో మరింత అద్భుతంగా కనిపిస్తారు' అని వ్యాఖ్యానించింది.
అత్తారింటికి దారేది సినిమా గురించి మాట్లాడుతూ...'ఇది యాక్షన్ చిత్రం కాదు. పాత్రల మధ్య మంచి సంభాషణ ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్. త్రివిక్రమ్ రాసిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక రకంగా మాటలతో మాయ చేసాడని చెప్పొచ్చు' అని సమంత వ్యాఖ్యానించింది.
ప్రస్తుతానికి బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచనలు లేవని చెప్పిన సమంత...ఇప్పుడు తెలుగు, తమిళంలో చాలా మంచి సినిమాలు చేస్తున్నానని, సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లాలనే కోరిక కూడా లేదని సమంత స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











