Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ వేలు పెడితే.. రవితేజ అదిరిపోయే సమాధానం, 70 శాతం ఊహించని విధంగా!
Recommended Video
మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం నేల టిక్కెట్టు చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో రవితేజ వరుసగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. పవన్ కళ్యాణ్ తనకు మంచి స్నేహితుడని రవితేజ తెలిపాడు. ఈ ఆడియోవేడుకలో రవితేజ ధరించిన టోన్ జీన్స్ ని పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు. ఇది సోషల్ విడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిగురించి ఓ ఇంటర్వ్యూ లో రవితేజ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.
అనాధగా
తాను నేల టిక్కెట్టు చిత్రంలో అనాధగా నటిస్తున్నట్లు రవితేజ తెలిపారు. ఈ జనరేషన్ పిల్లలు తమ తల్లిదండ్రులని సరిగా పట్టించుకోవడం లేదు. ఈ అంశంపైనే నేల టిక్కెట్టు చిత్రం ఉంటుందని రవితేజ తెలిపారు.
వైరల్ అయిన వీడియో
నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్, రవితేజ చాలా సరదాగా కనిపించారు. రవితేజ ధరించిన టోన్ జీన్స్ ప్యాంట్ గమనించిన పవన్ కళ్యాణ్ దానిని తాకుతూ కనిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏంటి ఈ రచ్చ
దీని గురించి రవితేజ స్పందించారు. తాను ధరించిన టోన్ జీన్స్ ప్యాంట్ పవన్ కళ్యాణ్ ని బాగా ఆకర్షించింది. అందువలనే పవన్ కళ్యాణ్ దానిని పరిశీలించాడు. పవన్ కళ్యాణ్ చాలా సరదా మనిషి. దానిని కూడా ఇలా రచ్చ చేస్తారా. అసలు ఇది చర్చించాల్సిన విషయమే కాదు అని రవితేజ సమాధానం ఇచ్చారు.
తేరి 70 శాతం
రవితేజ తదుపరి శ్రీనువైట్ల, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించబోయే చిత్రం తేరి రీమేక్ గా రాబోతోంది. తమిళ తేరి చిత్రానికి, దీనికి 70 శాతం మార్పు ఉంటుంది, మీరే చూసారుగా అంటూ రవితేజ సమాధానం ఇచ్చారు.