పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంక్చువాలిటీ సూపర్...!
పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో గణేష్ బాబు ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష, కృతి కర్భందా కథానాయికలుగా నటిస్తున్నారు. జానీ, కొమరం పులి చిత్రాల నిర్మాణానికి చాలా టైట్ తీసుకున్నప్పటికీ, విడదుదలయిన తర్వాత ఇవి పరాజయం పాలవ్వడం పవన్ కళ్యాణ్ ని ఆలోచనలో పడేసింది. అందుకని ఈ తాజా చిత్రాన్ని ఎంత త్వరగా వీలుపడితే అంత త్వరగా ముగించేయాలనుకుంటున్నాడు. అనుకున్న టైమ్ కు షూటింగ్ కు రావడం పర్ ఫెక్ట్ గా చేయడం యూనిట్ సభ్యులను సైతం ఆశ్చర్య పరుస్తోందట. కృతి అయితే పవర్ స్టార్ పంక్చువాలిటీ సూపర్ అంటోంది.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ 'క్రీస్తు" చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. కాగా 'క్రీస్తు" చిత్రం షూటింగ్ టైమ్ లో పవన్ కళ్యాణ్ కి సింగీతం శ్రీనివాసరావు వినిపించిన 'ట్రాఫిక్ జామ్" స్టోరీలైన్ పవన్ కు నచ్చినట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications