నాకు తెలిసి పవన్ లా మరో ఇతర హీరో...: పూరీ జగన్
హైదరాబాద్: నాకు తెలిసి పవన్ చదివినన్ని పుస్తకాలు మరే ఇతర హీరో చదివి ఉండడు. నేను మర్చిపోయిన కొన్ని తెలుగు పదాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. పుస్తకాలు విరివిగా దొరికే ఓ వైబ్‌సైట్ పేరు చెప్పారు. ప్రకాష్‌రాజ్ నాకూ, పవన్‌కీ చలం పుస్తకాలన్నీ కానుకగా పంపించారు అన్నారు. ఇక పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో కనిపిస్తుంది. పవన్‌లో నిజాయితీ రాంబాబు పాత్రలోనూ కనిపిస్తుంది అన్నారు.
పవన్‌కల్యాణ్ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియా సమావేశం జరగింది. ఈ మీడియా సమావేశంలో పూరీ జగన్ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఇందులో కొత్త పవన్‌కల్యాణ్‌ని చూస్తారు. పతాక సన్నివేశానికి ముందు పవన్‌చెప్పే 4 నిమిషాల డైలాగ్ సినిమాకే హైలైట్. ఇక ఈ సినిమాకు క్లైమాక్స్ ఓ పెద్ద ఎస్సెట్. సాధారణంగా క్లైమాక్స్ అంటే భారీ యాక్షన్ సీన్స్ కామన్. ఇందులో అసలు క్లయిమాక్స్ ఫైటే ఉండదు. మరి ఎలా తీశానో రేపు తెరపై చూస్తారు అన్నారు.
పేపర్లో, టీవీలో న్యూస్ చూసి స్పందించే కుర్రాడు జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుందో రాంబాబు పాత్ర అలా ఉంటుంది. మన రాష్ట్రంలో వచ్చిన ఒక పెద్ద సమస్యని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ. రాంబాబు అనే జర్నలిస్ట్ రానా బాబు అనే రాజకీయ నాయకుడి తో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూపిస్తున్నాం. రాంబాబు పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తూంటే,రానా బాబు పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. పవన్ కి ఈ సినిమా కథ, కంటెంట్, రాంబాబు పాత్ర చాలా బాగా నచ్చాయి. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి అన్నారు.
''ప్రపంచంలో ఎవరిపని వాళ్లు సవ్యంగా చేసుకోవడంలేదు కాబట్టే... పరిస్థితిని చక్కదిద్దడానికి మూడో మనిషి అవసరం అవుతోంది. ఆ మూడో వ్యక్తే 'ప్రెస్'. సమాజానికి ప్రశ్నార్థకంగా మారిన ఓ పొలిటీషియన్‌కీ, ఓ జర్నలిస్ట్‌కీ మధ్య జరిగిన పోరాటమే 'కెమెరామేన్ గంగతో రాంబాబు. పవన్‌కల్యాన్ అభిమానులకు కన్నుల పండుగ ఈ సినిమా'' అని పూరి జగన్నాథ్ అన్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం గురువారం విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











