పవన్ కళ్యాణ్ ఆర్డినరీ పర్సన్ కాదు....!

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు రకరకాలుగా చెబుతుంటారు. అఫ్ కోర్స్ ఎవరి హీరో వారికి గొప్పగానే కనిపిస్తారు. మరో వైపు పవన్ కళ్యాణ్ చేసే పలు కార్యక్రమాలు కూడా ఆయనపై ఒక మంచి అభిప్రాయం కలగడానికి కారణం అయి ఉండచొచ్చు. కానీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా మాట్లాడుతుండటం చర్చనీయాంశం అయింది.

పవన్ కళ్యాణ్ గురించి వెంకటేష్ మాట్లాడుతూ.....'పవన్ కళ్యాణ్ ఆర్డినరీ పర్సన్ కాదు' అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్‌కి గుడ్ లక్ చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో చాలా కాలంగా వెంకీకి పరిచయం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కూడా సింపుల్‌గా ఉండే వ్యక్తులు. ఇపుడు ఇద్దరూ కలిసి'గోపాలా గోపాలా' చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్.

Pawan Kalyan isn't an ordinary person

ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ భగవంతుడి పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఆయన పాత్ర నిడివి 30 నిమిషాలకు మించి ఉండదు. వ్యాపారి పాత్రలో వెంకటేష్‌ నటిస్తుండగా, ఆయన సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

హిందీ వెర్షన్లో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం. 'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X