ప్రూఫ్స్ ఉన్నాయట: పవన్ కళ్యాణ్‌పై మరోసారి రెచ్చిపోయిన శ్రీరెడ్డి!
Recommended Video

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఓ ప్రెస్‌మీట్లో పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నాలుగు వివాహాలు చేసుకున్నాడు, కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తున్నాడు అంటూ ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారి తీసింది. జగన్ మీద విమర్శలు చేస్తూ కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు రివర్స్ కౌంట్లర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టింది.
ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ...
నలుగురు పెళ్లాలు ఉన్నారు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.... పవన్ కళ్యాణ్ మీద కఠినమైన పదజాలం వాడుతూ ఆరోపణలు చేశారు.

చెన్నైలో శ్రీరెడ్డి అలజడి
ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన శ్రీరెడ్డి... కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో తమిళ సినీ పరిశ్రమలో అలజడి రేపుతోంది. పలువురు తమిళ దర్శకులు, నిర్మాతలు, హీరోలపై ఆరోపణలు చేస్తూ దూకుడుగా ముందుకు సాగుతోంది.

వ్యభిచారం కేసులు..
గతంలో తెలుగు సినిమా పరిశ్రమలోనూ శ్రీరెడ్డి ఇలాంటి వాతావరణం క్రియేట్ చేసింది. అయితే ఆమె విషయంలో ఎవరూ పెద్దగా రియాక్ట్ అవ్వకుండా పట్టించుకోకుండా వదిలేశారు. అయితే తమిళనాడులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. శ్రీరెడ్డిపై వ్యభిచారం కేసులు పెట్టి ఈ ఇష్యూను మరింత హీటెక్కించారు.
ఏమాత్రం తగ్గని శ్రీరెడ్డి
అయితే అన్నింటికీ తెగించే తాను వచ్చానని చెబుతున్న శ్రీరెడ్డి.... తనపై కేసులు పెడుతున్న వారికి కౌంటర్ ఇస్తూ మొండిగా ముందుకు సాగుతోంది. నేను కొట్టే దెబ్బకు సిద్ధంగా ఉండూ అంటూ వారాహి అనే నటుడికి వార్నింగ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











