»   » పవన్‌కు క్లోజ్: బ్రహ్మీ, అలీలపై మెగాస్టార్ కన్నెర్ర!?

పవన్‌కు క్లోజ్: బ్రహ్మీ, అలీలపై మెగాస్టార్ కన్నెర్ర!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించి రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నాడు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లాంటి వారిని ప్రధాని చేస్తే దేశానికి మంచి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగుతూ ఆ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్న అన్నయ్య చిరంజీవికి తమ్ముడి వ్యవహారం అస్సలు నచ్చడం లేదు.

పవన్ కళ్యాణ్ పోకడలకు చాలా మంది సినీ ప్రముఖులు కూడా మద్దతు పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే అలీ, బ్రహ్మానందం కూడా ఆయనకు మద్దతుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బ్రహ్మానందం ప్రైవేట్‌గా పవన్ కళ్యాణ్‌ను మీట్ కావడంతో....బ్రహ్మానందం బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చారు. దీంతో కంగారుపడ్డ బ్రహ్మీ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Pawan Kalyan Jana Sena affects Chiranjeevi

ఇక మరో కమెడియన్ అలీ కూడా పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు. పవన్ కళ్యాణ్ సపోర్టు చేస్తున్న తెలుగు దేశం పార్టీ తరుపున అలీ రాజకీయాల్లోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. మొత్తానికి ఇలా పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్న చిరంజీవికి ప్రత్యర్థులుగా మారారు.

ఈ నేపథ్యంలో వారంతా చిరంజీవి ఆగ్రహానికి గురయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో లేక పోయినా..... ఇండస్ట్రీని శాసించే సత్తా ఆయనకు ఉందని, పవన్ కళ్యాణ్‌కు సపోర్టు ఇస్తున్న వారి కెరీర్లపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

English summary
Pawan Kalyan Jana Sena affects Chiranjeevi. Chiranjeevi's brother Pawan Kalyan launches political party, vows to decimate Congress in Seemandhra
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu