»   » పవన్ కళ్యాణ్ ‘జన సేన’ పార్టీకి ఫస్ట్‌షాక్

పవన్ కళ్యాణ్ ‘జన సేన’ పార్టీకి ఫస్ట్‌షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించబోయే 'జన సేన' పార్టీకి తొలి షాక్ తగిలింది. 'జన సేన' పార్టీని ఈ నెల 10వ తేదీన రిజిస్టర్ చేయించేందుకు ఎన్నికల సంఘాన్ని సంప్రదించగా.......వారి ప్రతిపాదనను ఎన్నికల సంఘం తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిబంధనల ప్రకారం 'జన సేన' పార్టీని వెంటనే రిజిస్టర్ చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి 3 నుండి 4 నెలల సమయం పడుతుందని, అంతకంటే ముందుగా 'జన సేన' పేరుపై ఎవరూ అభ్యంతరం తెలపకుండా వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుందని, ప్రకటన ఇచ్చిన నెల రోజుల తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలువుతుందని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం.

Pawan Kalyan Jana Sena party shocked

ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'జన సేన' పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తనకు నమ్మకస్తులైన వారిని స్వయంగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా రంగంలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగులో ఆయన రాజకీయ పార్టీని ప్రకటించడంతో పాటు, పార్టీ విదివిధానాలు, తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ గురించి ప్రజలు, అభిమానులు, మీడియా వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Pawan Kalyan has applied to EC seeking registeration of his Jana Sena party on March 10th, 2014. He, however, got the shock of his life when he came to know that procedure to complete the registeration takes at least 3-4 months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu