డైరక్టర్ నన్ను మోసం చేసాడు: పవన్
జానీకి నేను కొత్త డైరక్టర్ ని పరిచయం చేసాను..అతన్ని నమ్మాను..అతను నన్ను మోసం చేసాడు అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన తన పంజా చిత్రం ప్రమోషన లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఇలా స్పందించారు. ఆయన్ని యాంకర్ ఇంటర్వూ చేస్తూ మీరు కొత్త ట్యాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు..అని అడిగితే..ఇలా చెప్పారు. అప్పట్లో ఆయనే స్వయంగా డైరక్ట్ చేస్తూ నటించిన జానీ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ విషయాన్ని ఆయనే గుర్తు చేసి తనపై తాను జోక్ వేసుకున్నారు. ఇక పంజా చిత్రం పై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
'పంజా' సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకి ఆరు కట్స్ తో U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం డ్యూరేషన్ 180 నిముషాలు అనగా మూడు గంటలు నిడివి ఉంది. ఇక ఈ చిత్రం పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ, నగేష్ ముంత, దేవినేని వెంకట్ నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలయ్యి మంచి టాక్ తెచ్చుకున్నాయి.
సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా పంజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సారాజేన్ డైస్, అంజని లావని హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించిన విష్ణువర్థన్ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే చాలా భాగం షూటింగ్ చేసారు. ఈ చిత్రంలో పవన్ పాత్ర చిత్రణ, వేషధారణ కొత్త పంథాలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: యువన్ శంకర్‌రాజా.


Click it and Unblock the Notifications











