twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెచ్చగొట్టిన ఫ్లెక్సీ ...జూ ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ ఫైట్

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ నెలకొంది. దీంతో పోలీసులు రంగం ప్రవేశ చేసి పరిస్థితి అదుపులోకి తేవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... నల్లగొండ జిల్లా కోదాడ లోని వెంకటేశ్వర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. థియేటర్ వద్ద పవన్ అభిమానులు ''తాతల నాటి చరిత్ర చెప్పుకునే ఆలోచన మాది కాదని, చరిత్ర సృష్టించే చరిత్రలే భావితరాలకు భగవద్గీత'' అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

    దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం తెలిపారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని నిరసన తెలిపారు. దీంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం నెలకొంది. వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటే పరిస్థితి విషయమించి ఈ గొడవలు రాష్ట్రం మొత్తం పాకే అవకాశం ఉన్నందున... విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

    English summary
    Pawan Kalyan-Jr Ntr fans fight at Kodhada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X