కాస్కోండి : పవన్ కళ్యాణ్ - జూ ఎన్టీఆర్ ఢీ!
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బాక్సాఫీసు బరిలో ఒకరికి పోటీగా ఒకరు ఒకే సమయంలో రంగంలోకి దూకబోతున్నారు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాను ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా, రెండు రోజుల గ్యాప్ తో ఆగస్టు 9న హరీష్ శంకర్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'రామయ్యా వస్తావయ్యా' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తన్నారు. ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి బాక్సాఫీసుకు ఫైట్ కు రెడీ అవుతుండటం ఫిల్మ్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
పవన్ కళ్యాణ్ సినిమాలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగిన విధంగానే నైజాం రైట్స్, ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయి. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో పవన్ డ్రైవర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' మూవీ విషయానికొస్తే...ఈ చిత్రంలో కూడా సమంతే హీరోయిన్. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాద్ షా సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈచిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
రెండు భారీ సినిమాలే కావడం, రెండు భారీ తారాగణం తో కూడిన సినమాలే కావడంతో....రెండింటిపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు భారీ అభిమాన గణం ఉన్న వారు కావడంతో విడుదల సమయానికి పోటీ ఆసక్తికరంగా మారనుంది. మరి ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తోరో చూడాలి.


Click it and Unblock the Notifications











