చరణ్ నిశ్చితార్థ వేడుకలో పవన్-జూ ఎన్టీఆర్ ముచ్చట్లు...!
నిన్న రామ్ చరణ్ ఉపాసన ఎంగేజ్ మెంట్ లో అందర్నీ ఆకట్టుకున్న విషయం పవన్ కళ్యాణ్ - జూ ఎన్టీఆర్ ముచ్చట్లు. వివాహ వేడుకలలో వధూవరులు ఎంజాయ్ చేయడం తక్కువ. ఆ వేడుకల ద్వారా కలుసునే అతిధులు, వాటిని ప్రసారం చేసే మీడియా, సొంత ఫంక్షన్ కూడా ఇంతలా పట్టించుకోరేమో అన్న రీతిలో వీక్షించే జనాల హడావుడి ఎక్కువ వుంటుంది.
ఇటు సినీ పరిశ్రమలో..మీడియా సర్కిల్స్ లో మెగా ఫ్యామిలీకీ..నందమూరి ఫ్యామిలీకీ మధ్య ఆదిపత్య పోరు కాస్తా ఒకరంటే ఒకరికి పడదన్న ప్రచారం వుంది. మేమంతా సినీ కుటుంబానికి చెందిన వారం మా మధ్య విభేదాల్లేవు.."అని ఇటు మెగా ఫ్యామిలీ...అటు నందమూరి ఫ్యామిలీ..ఎన్ని సందర్భాల్లో వివరణ ఇచ్చుకున్నా..ఇరు కుటుంబాల మధ్యా విభేదాల విషయమై ఎప్పటికప్పుడు మీడియాలో కథానాలు విన్సిస్తూనే వుంటాయి. అయితే అవేవీ తమకు పట్టవంటూ చరణ్ ఉపాసన ఎంగేజ్ మెంట్ లో పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ చాలా సేపు సరదా సరదాగా మాట్లాడుకున్నారు. దేని గురించో తెలియదు కాని ఎన్.టి.ఆర్ & పవన్ కళ్యాణ్ మధ్య అసలు ఊహించని సుధీర్ఘమైన సంభాషణ, చర్చ చాలా ఆశ్చర్యానికి గురి చేసింది..
ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొన్ని విశేషాలు పరిశీలిస్తే: పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి కొడుకులా వున్నాడు. ఫంక్షన్ అంతా పవన్ కళ్యాన్ ఎంతో ఉషారుగా వుండటం బాగుంది. మెగా ఫ్యామిలీ మధ్య గొడవలు మీడియా చెప్పినట్టు విడిపోయెంతగా లేవని ఈ వేడుక సాక్షిగా నిలిచింది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు కలిసి కనిపించక పోవడంతో, రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ కు మనస్పర్ధలు వచ్చాయని వెబ్ మీడియా కోడై కూస్తుంది. ఎప్పటిలానే ఆ రూమర్స్ ను పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కలిసి కనిపిస్తారని ఎదురుచూసిన కొందరు అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ప్రశ్నను పంజా టీమ్ కవర్ చేసిందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











