BRO అరగంట అద్దె ఇల్లు.. అంబటి రాంబాబుపై వెబ్ సిరీస్‌.. జనసేన నేతల ఘాటైన కౌంటర్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమాల్లో రాజకీయాలు.. రాజకీయాల్లో సినిమాల అంశాలు సెన్సేషనల్‌గా మారాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో బ్రో ది అవతార్ సినిమా కలకలం రేపుతున్నది. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్‌ను పరోక్షంగా ఉదహరిస్తూ ఓ వ్యక్తి జీవిత కథను MRO (Marriage Relations Offend) టైటిల్‌తో సినిమా తీస్తున్నానని మంత్రి అంబటి రాంబాబు చెప్పిన కథకు జనసేన నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ వివరాల్లోకి వెళితే..

ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ మూవీ బ్రో ది అవతార్ చిత్రంలో తనను పోలీన వ్యక్తితో సెటైరికల్‌గా డ్యాన్స్ చేయించడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆ పాత్రను చూపించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మూడు పెళ్లిళ్లు చేసుకొన్న ఓ వ్యక్తి జీవితం ఆధారంగా ఓ సినిమాను తాను మరికొందరితో కలిసి నిర్మాతగా మారి సినిమా తీస్తున్నాను అంటూ కొన్ని టైటిల్ ప్రకటించారు.

Jana Sena Party leader planning Web Series on Minister Ambati Rambabu

మూడు పెళ్లిళ్లు చేసుకొన్న ఓ వ్యక్తిపై మేము తీయబోయే సినిమాకు టైటిల్స్ కూడా పెట్టాం. పెళ్లి పెటాకులు, MRO (Marriage, Relations, Offender), మూడు మూళ్లు ఆరు పెళ్లిళ్లు..నిత్య పెళ్లి కొడుకు, తాళి ఎగతాళి, బహు భార్య ప్రవీణ్యుడు లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మీలో ఎవరైనా మించి టైటిల్ సూచిస్తే వాటిని పరిశీలనలోకి తీసుకొంటాం. నేను చెప్పిన తర్వాత ఆ కథ పవన్ కల్యాణ్‌దని భావిస్తే మీరు భావించుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అంబటి రాంబాబు అన్నారు.

అయితే అంబటి చేసిన సినిమా నిర్మాణం ప్రకటనకు జనసేన నేతలు ఘాటుగా బదులిచ్చారు. అంబటి రాంబాబు పేరును డైరెక్టుగా మాట్లాడుతూ ఆయన జీవితంపై ఓ వెబ్ సిరీస్ తీస్తున్నాం. ఆయన కోసం ఇద్దరు హీరోయిన్లను వెతుకుతున్నాం. ఆయనను చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని వేశ్యావాటికలను సంప్రదిస్తున్నాం. అందులో కోల్‌కతాలోని సోనాగచ్చి కూడా ఉంది అని జనసేన నేత అన్నారు.

Jana Sena Party leader planning Web Series on Minister Ambati Rambabu

మేమందరం ఈ సినిమా కోసం చందాలు వేసుకొని సినిమా తీస్తున్నాం. తక్కువ ఖర్చుతో సినిమా తీస్తాం. రెండు నెలల్లో రిలీజ్ చేస్తాం. సంజన, సుకన్య క్యారెక్టర్లతో థాయ్‌లాండ్, బ్యాంకాక్ వెళ్లి ట్రిపుల్ ఎక్స్ సినిమా తీస్తున్నాం. జనసేన పార్టీతో పెట్టుకొంటే ఇలాగే ఉంటుంది అని అన్నారు.

మంత్రి అంబటి రాంబాబుకు మరో జనసేన నేత కౌంటర్ ఇస్తూ.. తక్కువ బడ్జెట్‌తో వెబ్ సిరీస్ తీస్తున్నాం. ఆ వెబ్ సీరిస్‌కు తల్లి చెల్లి ఖైదీ నంబర్ 6093, AXE (గొడ్డలి), డాటర్ ఆఫ్ వివేకా, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు, కోడి కత్తి సమేత శ్రీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అద్దె ఇల్లు, ఓ ఖైదీ వదిలిన బాణం లాంటి టైటిల్ పరిశీలనలో ఉన్నాయి. మీ నుంచి ఎవరైనా మంచి టైటిల్స్ సూచిస్తే పరిగణనలోకి తీసుకొంటాం అని జనసేన నేత చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X