»   » సూరీడల్లే వచ్చాడు ... పవర్ చూపించిన కాటమరాయుడు (వీడియో)

సూరీడల్లే వచ్చాడు ... పవర్ చూపించిన కాటమరాయుడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడుతోంది. మార్చి 24న 'కాటమరాయుడు' రిలీజుకు సిద్ధమవుతోంది. పవర్ స్టార్ అభిమానులు త‌మ అభిమాన హీరో తాజా చిత్రం కాట‌మ‌రాయుడు కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వేయిట్ చేస్తున్నారు. షూటింగ్ శ‌ర‌వేగంగా కంప్లీట్ చేసుకునే ప‌నిలో ఉన్న కాట‌మ‌రాయుడు టీజ‌ర్ యూట్యూబ్ రికార్డుల‌ను షేక్ చేసుకుంటూ దూసుకుపోతోంది.

ఇక సినిమా కోసం ఎంతో ఆతృత‌తో వెయిట్ చేస్తోన్న మెగా ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ వ‌చ్చేసింది. కాట‌మ‌రాయుడు టీం ఇక నుంచి సినిమా రిలీజ్ అయ్యే వ‌ర‌కు ఇవ్వబోయే వరుస స‌ర్‌ఫ్రైజ్‌ లో భాగంగా ఫస్ట్ బ్లాస్ట్ ఇచ్చేసింది . మెగా ఫ్యామిలీ కొత్త సాంప్రదాయం ప్రకారం ఆడియో కార్యక్రమం నిర్వహించకుండా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని భావించిన నిర్మాతలు మొదట టైటిల్ టైటిల్ సాంగ్ ను విడుదల చేసేసారు.


Pawan Kalyan Katama Rayudu Movie Title Song 'Mira Mira Meesam' Teaser Released

ఈ వార్త అలా వెలువ‌డిందో లేదో ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో సంద‌డి స్టార్ట్ అయ్యింది. చెప్పిన సమయం కన్నా ఒక అరగంట ఆలస్యం అయింది ఫ్గానీ ఒక్కసారి సాంగ్ చూస్తే అదంతా మర్చిపోవచ్చు. దాదాపు ఇంకో ఆరునెలలపాటు ఒక ఊపు ఊపేస్తుందనటం లో సందేహం లేదు. ఇకముందు జరగబోయే అన్ని జనసేన మీటింగుల్లోనూ ఈ పాట హోరెత్తుతుంది.ఈ పాట 400 వందలమంది డాన్సర్లతో చిత్రీకరించారన్న వార్తలు చూస్తూంటే సినిమాలో కూడా ఈ పాట ఎంత గ్రాండ్ గా ఉండబోతోందో అర్థమై పోతుంది.


నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మాణంలో గోపాల గోపాల ఫేం డాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా మార్చి 12న ప్రీ రిలీజ్ వేడుకని గ్రాండ్ గా నిర్వహించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే సరైనోడు, ధృవ, ఖైదీ నెం 150, విన్నర్ చిత్రాలు ప్రీ రిలీజ్ వేడుకని జరుపుకొని మంచి విజయాలు సాధించడంతో కాటమరాయుడు టీం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

English summary
The Katama Rayudu Movie is announced to be releasing on March 24 as an Ugadi Telugu New Year 2017 Gift to all Fans. The Pawan Kalyan Katama Rayudu Movie Title Song 'Mira Mira Meesam' Teaser Released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu